అప్పుడే అందిన యాగఫలం
యాగం పూర్తయితే యాగఫలం దక్కుతుందంటారు. కానీ కేసీఆర్‌కు మాత్రం అంతకంటే ముందే యాగఫలం దక్కుతున్నట్టు కనిపిస్తోంది. యాగానికి చంద్రబాబును ఆహ్వానించడంతో తెలంగాణలో టీడీపీ సగం చచ్చుబడిపోయిందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అది కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ఈ కలయిక కారణంగా గ్రేటర్ తమ్ముళ్లు బరిలో దిగేందుకు సంశయిస్తున్నారు. చంద్రబాబును కేసీఆర్ కలిసిన తర్వాత టీటీడీపీ నేతల ప్రెస్‌మీట్ల ప్రవాహం ఆగిపోవడం కూడా అందుకు నిదర్శం అంటున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే బాబును కేసీఆర్ కలిసిన […]
యాగం పూర్తయితే యాగఫలం దక్కుతుందంటారు. కానీ కేసీఆర్‌కు మాత్రం అంతకంటే ముందే యాగఫలం దక్కుతున్నట్టు కనిపిస్తోంది. యాగానికి చంద్రబాబును ఆహ్వానించడంతో తెలంగాణలో టీడీపీ సగం చచ్చుబడిపోయిందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అది కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ఈ కలయిక కారణంగా గ్రేటర్ తమ్ముళ్లు బరిలో దిగేందుకు సంశయిస్తున్నారు. చంద్రబాబును కేసీఆర్ కలిసిన తర్వాత టీటీడీపీ నేతల ప్రెస్‌మీట్ల ప్రవాహం ఆగిపోవడం కూడా అందుకు నిదర్శం అంటున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే బాబును కేసీఆర్ కలిసిన రోజే ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారు. ఆ తర్వాత ఏ నేత కూడా పెద్దగా టీఆర్‌ఎస్‌ను విమర్శించింది లేదు. అంతే కాదు ఇద్దరు చంద్రుల కలయిక తర్వాత గ్రేటర్ పరిధిలో టీడీపీకి బాగా డామేజ్ జరిగిందని లెక్కలేస్తున్నారు. click to read: జగన్‌కు సవాల్ విసిరిన లోకేష్……..…
చంద్రబాబును కేసీఆర్ కలిసిన తర్వాత గ్రేటర్ పరిధిలోని ఓటర్లలో గతంలో టీఆర్‌ఎస్‌పై ఉన్నంత కోపం ఇప్పుడు లేదని అంటున్నారు. జగన్ భుజంపై నుంచి సీమాంధ్ర ఓట్లకు గురిపెడుదామంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే జగన్‌ను కేసీఆర్ అసలు యాగానికే ఆహ్వానించలేదు. అదే జగన్‌ను యాగానికి ఆహ్వానించి… చంద్రబాబు ఆహ్వానించకపోయి ఉంటే ”మా స్వామిరంగా అప్పుడు చూపించేవాళ్లం మా తడకా” అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్, కేసీఆర్ కుమ్మకయ్యారని, సీమాంధ్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, గ్రేటర్ సీమాంధ్రుల రక్షకుడు టీడీపీయేనని చెప్పుకునే వారిమంటున్నారు. కానీ యాగం పేరుతో చంద్రబాబును కలిసి కేసీఆర్ టీడీపికి పెద్ద దెబ్బే కొట్టారని అంటున్నారు. అదే నిజమైతే ఇటు కేసీఆర్‌పై అటు టీడీపీపై యాగం ప్రభావం చూపినట్టే!.