Telugu Global
Others

రాజు గారు " ఓ కరివేపాకు

విష్ణుకుమార్‌రాజు. ఏపీ బీజేపీలో నోరున్న ఎమ్మెల్యే. అసెంబ్లీలో వీలుదొరికినప్పుడల్లా పెద్దమనిషి అవతారం ఎత్తి ఇరు పక్షాలను సరిచేస్తుంటారు. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో విష్ణుకుమార్‌రాజుకు విపరీతమైన మర్యాదలు జరిగాయట. రాజుగారు ఎక్కడ కనిపించినా సరే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు పదేపదే పలకరించారు. అసెంబ్లీ ఐదు రోజుల పాటు టీడీపీ సభ్యులు ఇచ్చిన మర్యాద చూసి రాజుగారి పొంగిపోయారని చెబుతున్నారు. ఆ ఆనందంతోనే సభలో చంద్రబాబును నవీన చాణిక్యుడు, రాజనీతిజ్ఞుడు అంటూ ఆకాశానికి ఎత్తారు. మంత్రుల నుంచి […]

రాజు గారు  ఓ కరివేపాకు
X

విష్ణుకుమార్‌రాజు. ఏపీ బీజేపీలో నోరున్న ఎమ్మెల్యే. అసెంబ్లీలో వీలుదొరికినప్పుడల్లా పెద్దమనిషి అవతారం ఎత్తి ఇరు పక్షాలను సరిచేస్తుంటారు. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో విష్ణుకుమార్‌రాజుకు విపరీతమైన మర్యాదలు జరిగాయట. రాజుగారు ఎక్కడ కనిపించినా సరే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు పదేపదే పలకరించారు. అసెంబ్లీ ఐదు రోజుల పాటు టీడీపీ సభ్యులు ఇచ్చిన మర్యాద చూసి రాజుగారి పొంగిపోయారని చెబుతున్నారు. ఆ ఆనందంతోనే సభలో చంద్రబాబును నవీన చాణిక్యుడు, రాజనీతిజ్ఞుడు అంటూ ఆకాశానికి ఎత్తారు. మంత్రుల నుంచి వస్తున్న సానుకూల స్పందన చూసిన విష్ణుకుమార్‌రాజు ఇదే అదను అన్నట్టు తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై కనిపించిన మంత్రికల్లా వినతిపత్రాలు ఇచ్చారు.

వాటిని ఆనందంగా స్పీకరించిన మంత్రులు గంటలో పనైపోతుందన్నట్టుగా స్పందించారట. కానీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా రాజుగారికి టీడీపీ నుంచి మర్యాదలు ఆగిపోయాయని చెబుతున్నారు. అప్పుడుగానీ రాజుగారికి అసలు సంగతి అర్థం కాలేదట. అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పుపట్టేందుకు ఒకరు కావాలన్న ఉద్దేశంతో బీజేపీకి చెందిన రాజుగారిని పెద్దమనిషిగా వాడుకున్నారట. అందుకోసమే సభ జరుగుతున్న రోజులన్నీ విష్ణుకుమార్‌రాజు వద్ద విపరీతమైన మర్యాద నటించిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాజుగారిని మరిచిపోయారు. అప్పట్లో ఇచ్చిన వినతిపత్రాలపై ఆరా తీసేందుకు ఓ మంత్రి దగ్గరకు వెళ్తే మంత్రిగారి దర్శనం దొరకలేదట. ఫోన్ చేస్తే మంత్రి తీయలేదు. దాంతో రాజుగారి గుండె మండిందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తనను తెలివిగా వాడుకున్నారని అంచనాకు వచ్చారు. చూద్దాం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు వస్తాయిగా అని సన్నిహితుల దగ్గర విష్ణుకుమార్‌రాజు అన్నారని చెబుతున్నారు.

First Published:  24 Dec 2015 11:16 AM IST
Next Story