Telugu Global
Cinema & Entertainment

ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పెళ్లి తర్వాత సినిమాలలో కన్నా ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో కనిపిస్తున్నాడు ఈ హీరో. తాజాగా తన భార్య కోసం తీసుకున్న నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది జూలై 7న మీరా రాజ్ పుత్ ని పెళ్లి చేసుకున్న షాహిద్ ఆమె కోసం సిగరెట్ కాల్చటం మానేశాడట. సిగరెట్ అలవాటు లేని షాహిద్ ని తను మరింత ఇష్టపడతానని చెప్పి, ఈ దురలవాటు […]

ఆ అలవాట్లు మానుకుంటున్న హీరోలు
X
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పెళ్లి తర్వాత సినిమాలలో కన్నా ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో కనిపిస్తున్నాడు ఈ హీరో. తాజాగా తన భార్య కోసం తీసుకున్న నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది జూలై 7న మీరా రాజ్ పుత్ ని పెళ్లి చేసుకున్న షాహిద్ ఆమె కోసం సిగరెట్ కాల్చటం మానేశాడట. సిగరెట్ అలవాటు లేని షాహిద్ ని తను మరింత ఇష్టపడతానని చెప్పి, ఈ దురలవాటు నుంచి షాహిద్ ను దూరంగా చేసింది అతడి సతీమణి.
షాహిద్ మాత్రమే కాదు గతంలో మరి కొంతమంది హీరోలు కూడా ఇలా కుటుంబం కోసం తమ అలవాట్లను మానుకున్నారు. బాలీవుడ్ బాద్ షా.. షారూఖ్ కూడా చిన్న కొడుకు అబ్ రామ్ పుట్టిన తరువాత స్మోకింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇక మన టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు సైతం తన కొడుకు గౌతం కోసం సిగరెట్ తాగటం మానేశాడు. తెర మీద హీరోలుగా కనిపించే మన ఫిలిం సెలబ్రిటీలు, తన నిర్ణయాలతో నిజ జీవితంలో కూడా హీరోలనిపించుకుంటున్నారు.
First Published:  23 Dec 2015 7:07 PM GMT
Next Story