ముదిగుబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద శనివారం(26 డిసెంబర్) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు గంటల సమయంలో సిమెంట్ లోడ్ లారీ, ఓమ్ని వ్యాను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఓమ్నీవ్యానులో ఉన్న నలుగురు చనిపోయారు. మృతులు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. తిరుమల వెంకన్న దర్శనం ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు గాయపడగా వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.