కన్నెర్ర చేసిన చంద్రబాబు
వేతన బకాయిలు చెల్లించడంతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్‌వాడీ మహిళలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. చలో విజయవాడలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల దాదాపు 14 వేలపై వేటు పడనుంది. చలో విజయవాడకు వచ్చిన వారి దృశ్యాల ఆధారంగా గుర్తు పట్టి వేటు వేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈనెల 18న విజయవాడకు వచ్చిన అంగన్‌వాడీలు, హెల్పర్లను కెమెరాలతో […]

వేతన బకాయిలు చెల్లించడంతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్‌వాడీ మహిళలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. చలో విజయవాడలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల దాదాపు 14 వేలపై వేటు పడనుంది. చలో విజయవాడకు వచ్చిన వారి దృశ్యాల ఆధారంగా గుర్తు పట్టి వేటు వేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఈనెల 18న విజయవాడకు వచ్చిన అంగన్‌వాడీలు, హెల్పర్లను కెమెరాలతో ఆ రోజే పోలీసులు చిత్రీకరించారు. ఆ వీడియోలను పంపుతున్నామని వాటి ఆధారంగా ఆయా జిల్లాలకు సంబంధించి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి తీసివేయండంటూ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.