బాబుకు రూ. కోటిన్నరతో కొత్త వాహనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం కొత్త జామర్ వాహనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు కోటిన్నర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జామర్ అత్యంత అధునాతనమైనదిగా భావిస్తున్నారు. చంద్రబాబు కోసం ఇప్పటికే మూడు కాన్వాయ్‌లు వాడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక కాన్వాయ్, ఏపీలో పర్యటిస్తున్న మరొక కాన్వాయ్‌లు వాడుతుంటారు. ఆయా వాహన శ్రేణుల్లో భద్రత కోసం జామర్లను కొంటున్నారు. ఆ మధ్య చంద్రబాబు కోసం ఐదు కోట్లు ఖర్చు […]

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం కొత్త జామర్ వాహనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు కోటిన్నర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జామర్ అత్యంత అధునాతనమైనదిగా భావిస్తున్నారు. చంద్రబాబు కోసం ఇప్పటికే మూడు కాన్వాయ్‌లు వాడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక కాన్వాయ్, ఏపీలో పర్యటిస్తున్న మరొక కాన్వాయ్‌లు వాడుతుంటారు. ఆయా వాహన శ్రేణుల్లో భద్రత కోసం జామర్లను కొంటున్నారు. ఆ మధ్య చంద్రబాబు కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి అధునాతనమైన బస్సును కొనుగోలు చేశారు. తెలంగాణ సీఎం కూడా అంతే ఖరీదుతో అప్పట్లో బస్సు సమకూర్చుకున్నారు.