నారాయణ పదవిపై వేలాడుతున్న క్రిమినల్ కేసు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఒక క్రిమినల్ కేసు ఇప్పుడు వెంటాడుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన క్రిమినల్ కేసు అంశాన్ని దాచడం దుమారం రేపుతోంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయాలని ప్రోబ్ అనే స్వచ్చంధ సంస్థ నిర్ణయించింది. ఒక వేళ నారాయణ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు కేసు ఏమిటంటే… 2010లో ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీకి చెందిన పుస్తకాలను కాపీరైట్స్ […]
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఒక క్రిమినల్ కేసు ఇప్పుడు వెంటాడుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన క్రిమినల్ కేసు అంశాన్ని దాచడం దుమారం రేపుతోంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయాలని ప్రోబ్ అనే స్వచ్చంధ సంస్థ నిర్ణయించింది. ఒక వేళ నారాయణ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు కేసు ఏమిటంటే…
2010లో ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీకి చెందిన పుస్తకాలను కాపీరైట్స్ ఉల్లంఘించి నారాయణ విద్యాసంస్థలు ముద్రించాయి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని పాఠాలను ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసి సొంత పుస్తకాలు ముద్రించుకున్నారు. దీంతో అప్పట్లో తెలుగు అకాడమీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణ కాలేజీల అధినేత నారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. కేసులో ఏ1గా నారాయణ ఉన్నారు. కేసు విచారణ నిలిపివేయాలంటూ ఓ దశలో నారాయణ హైకోర్టుకు కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే తనపై ఈ క్రిమినల్ కేసు ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో నారాయణ అపిడవిట్‌లో సమర్పించలేదు. దీంతో ప్రోబ్ సంస్థ ఈసీకి ఫిర్యాదు చేయబోతోంది. అప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.