వారంటే దిల్‌రాజుకు జెలసీ ఎందుకు?
గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ తరువాత ఆ స్థాయిలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాతగా తక్కువకాలంలోనే గుర్తింపు పొందారు దిల్‌రాజు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీని ఆయన తట్టుకోలేకపోతున్నారా? లేక తన బ్యానర్‌కు పోటీగా మరో సంస్థ వస్తుందని ఆందోళన చెందుతున్నారా? అన్న విషయంపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే? ఇటీవల ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని రూపొందించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ […]
BY sarvi23 Dec 2015 12:32 AM IST
X
sarvi Updated On: 23 Dec 2015 5:52 AM IST
గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ తరువాత ఆ స్థాయిలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాతగా తక్కువకాలంలోనే గుర్తింపు పొందారు దిల్‌రాజు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీని ఆయన తట్టుకోలేకపోతున్నారా? లేక తన బ్యానర్‌కు పోటీగా మరో సంస్థ వస్తుందని ఆందోళన చెందుతున్నారా? అన్న విషయంపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే? ఇటీవల ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని రూపొందించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన దిల్ రాజు యూవీ క్రియేషన్స్ మంచి సినిమాలు తీస్తుందని ప్రశంసించారు. వేదికపైకి నిర్మాతలు వంశీ, ప్రమోదల్‌ను పిలిచి భుజం తట్టారు.
బినామీలని అనేశాడు!
వీరిని పొగుడుతున్న క్రమంలోనే యూవీ క్రియేషన్స్ ప్రభాస్‌కు బినామీ బ్యానర్ అని అనేశారు. దిల్‌రాజు ఈ మాట అనేయడంతో అంతా షాక్ తిన్నారు. మిర్చి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వీరు ప్రభాస్‌కు సన్నిహితులు. అంత మాత్రాన వీరిని ప్రభాస్ బినామీలంటూ వేదికపై అనేయడం వారిని కొంత ఇబ్బందికి గురిచేసింది. యూవీ క్రియేషన్స్ మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో దూసుకుపోతోందని వీరిని చూస్తుంటే నాకు జెలసీగా ఉందని మనసులో మాట వెళ్లగక్కారు దిల్‌రాజు. దీంతో వారికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారా? తనకు పోటీగా వస్తున్నందకు ఈర్ష్య పడుతున్నారా? అన్న విషయంలో అక్కడున్న వారు గందరగోళంలో పడ్డారు.
Next Story