Telugu Global
Others

అసెంబ్లీకి తాళం వేయాలి

అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బుక్‌ఫెయిర్‌కు హాజరైన గవర్నర్ అక్కడే మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని కానీ ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్… ఏటా అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి” అన్నారు. ప్రాథమిక విద్యపై చర్చ జరగాల్సిందేనని అవసరమైతే నాలుగు రోజుల పాటు అసెంబ్లీకి తాళం వేసి (బహుశా ఎమ్మెల్యేలు […]

అసెంబ్లీకి తాళం వేయాలి
X

అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బుక్‌ఫెయిర్‌కు హాజరైన గవర్నర్ అక్కడే మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని కానీ ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్… ఏటా అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి” అన్నారు. ప్రాథమిక విద్యపై చర్చ జరగాల్సిందేనని అవసరమైతే నాలుగు రోజుల పాటు అసెంబ్లీకి తాళం వేసి (బహుశా ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా చేయడం కాబోలు) సభ్యుల అభిప్రాయాలు సేకరించాలన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బాగోగులకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

First Published:  23 Dec 2015 6:49 AM IST
Next Story