Telugu Global
Others

నా జోలికి వస్తే నీ అంతు చూస్తా చంద్రబాబు.. జాగ్రత్త

ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు మూడు రోజుల తర్వాత సభలో మహిళా టీడీపీ ఎమ్మెల్యేల చేత తనను తిట్టించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీఎస్టీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడానికి సిగ్గుగాలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నకాలంలోనూ ఇదే భాషను, హావభావాలను ప్రదర్శించానని అప్పుడు నచ్చి.. ఇప్పుడు నచ్చకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా సభ నుంచి సస్పెండ్ చేసి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మూడు రోజుల తర్వాత […]

నా జోలికి వస్తే నీ అంతు చూస్తా చంద్రబాబు.. జాగ్రత్త
X

ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు మూడు రోజుల తర్వాత సభలో మహిళా టీడీపీ ఎమ్మెల్యేల చేత తనను తిట్టించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీఎస్టీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడానికి సిగ్గుగాలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నకాలంలోనూ ఇదే భాషను, హావభావాలను ప్రదర్శించానని అప్పుడు నచ్చి.. ఇప్పుడు నచ్చకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా సభ నుంచి సస్పెండ్ చేసి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మూడు రోజుల తర్వాత అసెంబ్లీలో ఏడుపు సీన్‌కు తెరలేపారని రోజా విమర్శించారు.

ఎన్టీఆర్‌ను కూడా ఇలాగే వెన్నుపోటు పొడిచి అసెంబ్లీ నుంచి కన్నీటితో వెళ్లేలా చేశారని రోజా అన్నారు. అలాంటి వెన్నుపోటు రాజకీయాలు తనపై ప్రయోగించాలని చూస్తే చంద్రబాబు అంతు చూస్తానని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు భార్య, కోడలికి కూడా తాను ఒక విన్నపం చేస్తున్నానని రోజా అన్నారు. చంద్రబాబు పాలనతో ఆడవాళ్లు కన్నీరు పెడుతున్నారని… ఇది ఆయన వంశానికి కూడా మంచిది కాదన్నారు. ఆడవాళ్లు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడినట్టు చర్రితలో లేదని… మహిళ ఉసురు తగిలి నాశనం అయిపోతారని హెచ్చరించారు.

click to read: ఏ మహిళా కావాలని భర్తను వదులుకోదు- ఎమ్మెల్యే కంటతడి…

చదువుకోవాడానికి వెళ్లిన రిషితేశ్వరిని చంపేస్తే సొంత సామాజికవర్గం వారంటూ నిందితులను చంద్రబాబు వెనుకేసుకొచ్చారని ఆరోపించారు. అంగన్‌వాడీ మహిళలను బట్టలూడదీసి కొడుతుంటే చీము రక్తం ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇలాంటి పరిస్థితి చూసి మహిళా మంత్రులే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎస్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై దేశద్రోహం కేసు పెట్టించిన చంద్రబాబా ఎస్పీఎస్టీల గురించి మాట్లాడేది అని రోజా ప్రశ్నించారు. సీఎం ఉన్న విజయవాడలోనే దారుణాలు జరుగుతుంటే … నిందను మరొకరిపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా విమర్శించారు.

First Published:  22 Dec 2015 11:13 AM IST
Next Story