బాహుబలి గ్రాఫిక్స్ బడ్జెట్ ఎంతంటే
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పరంగా చాలా ఉన్నతమైన నాణ్యతతో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రాఫిక్స్ కు ఎంత ఖర్చు పెట్టారు అనేది అందరిలో ఆసక్తికరమైన అంశమే. ఈ విషయమై ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఊహించారు. అయితే ఈ విషయమై రాజమౌళి ఓ క్లారిటీని రీసెంట్ గా చెన్నైలోని ఐఐటీ స్టూడెంట్స్‌కి ఇచ్చారు. అక్కడ వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బడ్టెట్ ఎంతో చెప్పారు. 22 […]

ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పరంగా చాలా ఉన్నతమైన నాణ్యతతో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రాఫిక్స్ కు ఎంత ఖర్చు పెట్టారు అనేది అందరిలో ఆసక్తికరమైన అంశమే. ఈ విషయమై ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ఊహించారు. అయితే ఈ విషయమై రాజమౌళి ఓ క్లారిటీని రీసెంట్ గా చెన్నైలోని ఐఐటీ స్టూడెంట్స్‌కి ఇచ్చారు. అక్కడ వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బడ్టెట్ ఎంతో చెప్పారు.
22 కోట్లు రూపాయలు ఈ చిత్రం గ్రాఫిక్స్ పై ఖర్చు పెట్టినట్లు ఆయన రివీల్ చేసారు. అలాగే తన బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ అవతార్, లైఫ్ ఆఫ్ పై చిత్రాలకు పోలిక లేదని తేల్చి చెప్పారు. అయితే అంత తక్కువ ఖర్చుతో హాలీవుడ్ సినిమాల స్టాండడ్స్ లో గ్రాఫిక్స్ చేయించుకున్నామంటూ గర్వంగా చెప్పారు.