పాదాలు మన గురించి చెప్పేస్తాయట!
కళ్లు, ముక్కు, నోరు, నొసలు, కాళ్లు, చేతులు…వీటి ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆలోచనలను అంచనా వేయవచ్చంటూ చెప్పే సమాచారం ఇంటర్‌నెట్ ద్వారా మనకు చాలానే అందుబాటులో ఉంది. ఎవరో చెప్పాలా… మన గురించి మనకు తెలియదా అనుకోకుండా…వీటిని చెక్ చేసుకోవడం తమాషాగానూ, ఇంట్రస్టింగ్‌గానూ ఉంటుంది. అలాగే మన పాదాల రూపురేఖలను బట్టి మన మనస్తత్వం ఏమిటో తెలిసిపోతుందని, ఇవి శాస్త్రవేత్తలే నిరూపించిన అంశాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, మనశారీరక, మానసిక సంఘర్షణని బట్టి […]
కళ్లు, ముక్కు, నోరు, నొసలు, కాళ్లు, చేతులు…వీటి ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆలోచనలను అంచనా వేయవచ్చంటూ చెప్పే సమాచారం ఇంటర్‌నెట్ ద్వారా మనకు చాలానే అందుబాటులో ఉంది. ఎవరో చెప్పాలా… మన గురించి మనకు తెలియదా అనుకోకుండా…వీటిని చెక్ చేసుకోవడం తమాషాగానూ, ఇంట్రస్టింగ్‌గానూ ఉంటుంది. అలాగే మన పాదాల రూపురేఖలను బట్టి మన మనస్తత్వం ఏమిటో తెలిసిపోతుందని, ఇవి శాస్త్రవేత్తలే నిరూపించిన అంశాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, మనశారీరక, మానసిక సంఘర్షణని బట్టి పాదాల్లో మార్పులు వస్తాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ పాదాలు మన గురించి ఏమేం చెబుతాయి-
- పాదాలు వెడల్పుగా ఉంటే, వారు చాలా ఉత్సాహవంతులు అయి ఉంటారట. వీరు తమ పనులను తామే అత్యంత ఉత్సాహంగా చేస్తారు. పాదాలు సన్నగా ఉన్నవారు తమ పనులను ఇతరులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతారు.
- పాదం మధ్యభాగం వంపు లేకుండా తిన్నగా ఉంటే ఇలాంటివారు చాలా స్నేహపూరిత మనస్కులై ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారితో ఎక్కువ సమయం గడుపుతారు. వీరు సమస్యలను ఇతరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. అదే పాదం అడుగుభాగం వంపు తిరిగి ఉన్నవారు మానసికంగా బలవంతులు అయి ఉంటారు. వీరు కూడా ఇతరులతో స్నేహంగానే ఉంటారు కానీ, తమకంటూ కొంతసమయం కావాలనుకుంటారు. వీరు సమస్యలను తమకుతాముగా సొంతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడతారు. ఈ వంపు మరింత ఎక్కువగా ఉంటే వీరిలో స్వతంత్ర భావాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎవరినీ సహాయం అడగరు, అంతేకాదు, ఇలాంటి వారికి జీవితంలో పెద్ద కలలు, ఆశయాలు ఉంటాయి.
- పాదాలు పెద్దగా ఉన్నవారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి సమస్యనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. మడమలు పగిలేవారిలోనూ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. పాదాలు చిన్నగా ఉన్నవారిలో తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి. వీరు తమ అసలు వయసు కంటే చిన్న వయసున్నవారిలా కనబడతారు.
- బొటనవేలు పొడుగ్గా ఉన్నవారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. బొటనవేలు తరువాత వేలు పొడుగ్గా ఉన్నవారు మంచి నాయకులు, వారు ఇతరులను అనుసరించేందుకు ఇష్టపడరు.
- వేళ్లు చక్కగా ఒక వరుసలో అమర్చినట్టుగా ఉన్నవారు ఒక పద్ధతిగా నిజాయితీగా ఆలోచిస్తారు, అలాగే పనిచేస్తారు. వేళ్లు ఒకదానిపై ఒకటి ఎక్కినట్టుగా ఉన్నవారిలో నిజాయితీ తక్కువగా ఉంటుందట.
- వేళ్లు చివరివేలు వైపు వాలి పోయి ఉంటే మీరు చాలా బిజీగా పనిచేస్తున్నారని అర్థమట. ఒకవేళ బొటనవేలివైపు వాలిపోతూ ఉంటే ఆ వ్యక్తి ఎక్కువగా గతకాలపు ఆలోచనలతో బతికేస్తూ ఉంటాడు.
- కాళ్లలో వాపు ఉన్నవారు మనసులోని భావోద్వేగాలను వ్యక్తీకరించలేరట. వేళ్ల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నవారు గలగలా మాట్లాడేవారు, కామెడీని ఎంజాయి చేసేవారు అయి ఉంటారు. వీరు వినోద వాణిజ్యరంగాల్లో రాణిస్తారు.