ఈ సారి భన్సాలీ వెనక బడ్డాడు
బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ అంటే ఒక మార్క్ వున్న దర్శకుడు. భారీతనం అంటే ఆయన పేరు మాత్రమే ముందు గుర్తుకు వస్తుంది. గత యేడాది దీపిక పదుకోణే, రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్స్ లో చేసిన రామ్ లీలా చిత్రం ఊహించన విజయం సాధించింది. భారీ తనంతో పాటు.. సినిమా ఉత్తర భారత దేశ గ్రామీణ రాజకీయ జీవితాన్ని చూపుతూ మెప్పించాడు. కథ బలంగా ఉంది. దానికి ఆయన భారీ తనం.. నటీ నటుల […]
బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ అంటే ఒక మార్క్ వున్న దర్శకుడు. భారీతనం అంటే ఆయన పేరు మాత్రమే ముందు గుర్తుకు వస్తుంది. గత యేడాది దీపిక పదుకోణే, రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్స్ లో చేసిన రామ్ లీలా చిత్రం ఊహించన విజయం సాధించింది. భారీ తనంతో పాటు.. సినిమా ఉత్తర భారత దేశ గ్రామీణ రాజకీయ జీవితాన్ని చూపుతూ మెప్పించాడు. కథ బలంగా ఉంది. దానికి ఆయన భారీ తనం.. నటీ నటుల ప్రతిభావంతమైన నటన వెరసీ రామ్ లీలా సినిమాను సూపర్ హిట్ చేశాయి.
అయితే అదే ఫీవర్ మొన్నటి బాజీరావు వరకు ఆడియన్స్ లో కంటిన్యూ అయ్యింది. ఆయన నుంచి ఒక పిరియాడిక్ చిత్రం వస్తుంది అంటే.. అభిమానులు రామ్ లీలా విజయాన్ని రివైండ్ చేసుకున్నారు. కట్ చేస్తే. బాజీరావు మస్తానీ పిరియాడిక్ అయినప్పటికి.. సినిమా కథ లో బిగుతు లేక పోవడం సినిమాకు మైనస్ అయ్యి కుర్చుంది. ఆయన తరహా భారీ తనం మాత్రమే కొంత సేపు నయనానందకరం అన్నట్లు అనిపిస్తుంటుంది. కట్ చేస్తే ఈ చిత్రం తో ఆడియన్స్ అంచనాల్ని డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అందుకోవడంలో వెనక బడ్డాడు అంటున్నారు పరిశీలకులు. నిజమే మరి.