Telugu Global
Others

బ్యాక్‌ గ్రౌండ్ చూడండి... మంత్రులకు చంద్రబాబు క్లాస్

సోమవారం జరిగిన టీడీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల సమక్షంలోనే క్లాస్ పీకారు. కొందరు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధుల నుంచి మంత్రులపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయని చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా ఎందుకు తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫోన్ చేస్తే మంత్రులు తీయడం లేదని.. కనీసం గంటరెండు గంటల తర్వాతైనా తిరిగి కాల్ చేయడం లేదని అసెంబ్లీ వేదికగానే […]

బ్యాక్‌ గ్రౌండ్ చూడండి... మంత్రులకు చంద్రబాబు క్లాస్
X

సోమవారం జరిగిన టీడీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల సమక్షంలోనే క్లాస్ పీకారు. కొందరు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధుల నుంచి మంత్రులపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయని చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా ఎందుకు తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము ఫోన్ చేస్తే మంత్రులు తీయడం లేదని.. కనీసం గంటరెండు గంటల తర్వాతైనా తిరిగి కాల్ చేయడం లేదని అసెంబ్లీ వేదికగానే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కోవలోనే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులపై ఇటీవల సీఎంకు ఫిర్యాదు చేశారట. ఈనేపథ్యంలో మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫోన్లకు స్పందించాలని గట్టిగా చెప్పారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోకి వేలు పెట్టడం మానుకోవాలని మంత్రులకు సూచించారు. కాల్‌ మనీ అంశాన్ని కూడా టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు.

కాల్‌ మనీ నిందితులతో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో చంద్రబాబు హితబోధ చేశారు. స్నేహం చేసేటప్పుడు అవతలి వారు ఎలాంటి వారు… వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుని దోస్తి చేయాలని హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్టు తనకు తెలిసిందని పద్దతి మార్చుకోవాలని టీడీఎల్పీలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

First Published:  21 Dec 2015 9:00 PM GMT
Next Story