Telugu Global
NEWS

నాపై రౌడీషీటా? దుర్గపై ఆన !

తారా చౌదరి మరోసారి తెరపైకి వచ్చారు.  తనను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.  తాను ఏ తప్పు చేయకపోయినా పీడీయాక్ట్ ప్రయోగిస్తామని, రౌడీ షీట్ తెరుస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నానని తానేమీ తప్పుచేయలేదని విజయవాడలో అన్నారు. కొందరు అధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై తప్పుడు ప్రచార చేస్తున్నారని ఆరోపించారు.  ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల తన కుటుంబం ఏమైపోవాలని ప్రశ్నించారు.  తన వదినతో మాట్లాడేందుకు వెళ్తే తప్పుడు కేసులు పెట్టారన్నారు.  పోలీస్ ఉన్నతాకారి ఒకరు తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని తాను లొంగకపోవడంతో వేధిస్తున్నారని తారాచౌదరి […]

నాపై రౌడీషీటా? దుర్గపై ఆన !
X

తారా చౌదరి మరోసారి తెరపైకి వచ్చారు. తనను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా పీడీయాక్ట్ ప్రయోగిస్తామని, రౌడీ షీట్ తెరుస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నానని తానేమీ తప్పుచేయలేదని విజయవాడలో అన్నారు. కొందరు అధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై తప్పుడు ప్రచార చేస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల తన కుటుంబం ఏమైపోవాలని ప్రశ్నించారు. తన వదినతో మాట్లాడేందుకు వెళ్తే తప్పుడు కేసులు పెట్టారన్నారు. పోలీస్ ఉన్నతాకారి ఒకరు తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని తాను లొంగకపోవడంతో వేధిస్తున్నారని తారాచౌదరి చెప్పారు. ఈ వేధింపులపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారామె. చంద్రబాబు, డీజీపీ తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానన్నారు.

First Published:  21 Dec 2015 5:12 AM IST
Next Story