Telugu Global
Others

అమలాపురంలో రౌడీలు ఆ విధంగా ముందుకు

పిల్లి గుడ్డిదైతే ఎలుకకు వెటకారం ఎక్కువైంది అన్నట్టు తయారైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రౌడీల తీరు. భూకబ్జాలు, కిడ్నాప్‌లు, నేరాలకు పాల్పడుతున్న రౌడీ ముఠాలు ఇప్పుడు బ్రాండ్‌ కోసం తపిస్తున్నాయి. తమ ముఠాకూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలన్న ఉద్దేశంతో  లోగోలు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇందుకు పులులు, సింహాలు, గద్దల బొమ్మలతో లోగోలు తయారు చేయించుకుని వాటికి విస్రృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.  నగరంలో ఫ్లెక్సీలు పెట్టడం, ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా లోగోలకు ప్రచారం కల్పిస్తున్నారు . ఇలా లోగోల ద్వారా ముఠాకు ఒక బ్రాండ్ […]

అమలాపురంలో రౌడీలు ఆ విధంగా ముందుకు
X

పిల్లి గుడ్డిదైతే ఎలుకకు వెటకారం ఎక్కువైంది అన్నట్టు తయారైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రౌడీల తీరు. భూకబ్జాలు, కిడ్నాప్‌లు, నేరాలకు పాల్పడుతున్న రౌడీ ముఠాలు ఇప్పుడు బ్రాండ్‌ కోసం తపిస్తున్నాయి. తమ ముఠాకూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలన్న ఉద్దేశంతో లోగోలు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇందుకు పులులు, సింహాలు, గద్దల బొమ్మలతో లోగోలు తయారు చేయించుకుని వాటికి విస్రృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. నగరంలో ఫ్లెక్సీలు పెట్టడం, ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా లోగోలకు ప్రచారం కల్పిస్తున్నారు . ఇలా లోగోల ద్వారా ముఠాకు ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించి యువతను ఆకర్శిస్తున్నారు. గద్ద,పులి, సింహం బొమ్మతో పాటు జీకేఎస్, జేఎస్‌ఆర్‌, జీపీఆర్‌ వంటి పేర్లు యాడ్ చేస్తున్నారు. ఈ నిక్ నేమ్స్‌ అన్నీ ప్రముఖ రౌడీషీటర్లవి. పోలీసులు ఈ పరిస్థితిని గమనించడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రౌడీ గ్రూప్‌లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరికి కొందరు రాజకీయనాయకుల అండ కూడా ఉండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అయినా దైర్యం చేసినా ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇటీవల ఒక రౌడీషీటర్‌ జన్మదినం సందర్భంగా రౌడీషీటర్‌ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలమీద చిరాకుతో అతను రౌడీషీటర్‌ అనే విషయం తెలియజేస్తూ పోలీసులచేత ఫ్లెక్సీలు పెట్టించడం కొసమెరుపు.

First Published:  21 Dec 2015 5:24 AM IST
Next Story