చంద్రబాబుపై కేసు వేస్తా...
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో గుంటూరు జిల్లా నుంచి ఒక సీపీఎం నాయకుడు కూడా ఉన్నారంటూ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన మొత్తం అబద్దాలమయమని ఆరోపించారు. ప్రకటనలోని తొలి పేజీలో గుంటూరు జిల్లా సీపీఎం నుంచి ఒకరు ఉన్నట్టు చంద్రబాబు చెప్పారని అదే ప్రకటనలోని మూడో పేజీలోకి వెళ్లే సరికి గుంటూరు జిల్లా సీపీఎం నుంచి కాల్‌మనీలో ఒకరు కూడా లేరని మధు వివరించారు. […]
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో గుంటూరు జిల్లా నుంచి ఒక సీపీఎం నాయకుడు కూడా ఉన్నారంటూ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన మొత్తం అబద్దాలమయమని ఆరోపించారు. ప్రకటనలోని తొలి పేజీలో గుంటూరు జిల్లా సీపీఎం నుంచి ఒకరు ఉన్నట్టు చంద్రబాబు చెప్పారని అదే ప్రకటనలోని మూడో పేజీలోకి వెళ్లే సరికి గుంటూరు జిల్లా సీపీఎం నుంచి కాల్‌మనీలో ఒకరు కూడా లేరని మధు వివరించారు. స్యయంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలోనే తొలి పేజీకి, మూడో పేజీకి తేడా ఉందని చెప్పారు.
అసెంబ్లీలో ప్రకటన సందర్శంగా తొలిపేజీలోని వివరాలు చదవడం ద్వారా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో సీపీఎం వాళ్లు కూడా ఉన్నారన్న మేసేజ్‌ను చంద్రబాబు తెలివిగా జనంలోకి పంపారని ఆరోపించారు. టీడీపీ బురదను అన్ని పార్టీలకు అంటించేందుకు ఇలా చేశారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రకటన చేసిన చంద్రబాబు వెంటనే దాన్ని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబుపై కేసు వేస్తానని మధు హెచ్చరించారు. కాల్‌మనీ దుర్మార్గాన్ని అన్ని పార్టీల మెడకు చుట్టేందుకు చంద్రబాబు ఇంతగా దిగజారుతారని తాము ఊహించలేదని మధు చెప్పారు.