పవిత్ర అమరావతిలో అపవిత్ర చర్యలు
ఎంతో ఆర్భాటంగా కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమరావతి అంటే ఇంద్రుడు, దేవతలు నడయాడిన నేల అని.. ఎంతో పవిత్రమైనదని.. అలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నామని.. దేశ వ్యాప్తంగా నదులు, పుణ్యక్షేత్రాలు, అన్ని గ్రామాల నుంచి పుట్టమన్ను, నీళ్లు తెప్పించి హడావుడి చేశారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ ఆవరణలోని మట్టిని తెచ్చి చంద్రబాబుకు అప్పగించారు. కానీ అదంతా శంకుస్థాపన సమయం వరకే. ఇప్పుడక్కడ పరిస్థితి మరోలా ఉంది. దేశంలోని పుణ్యక్షేత్రాలు, నదులు, రాష్ట్రంలోని […]
ఎంతో ఆర్భాటంగా కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమరావతి అంటే ఇంద్రుడు, దేవతలు నడయాడిన నేల అని.. ఎంతో పవిత్రమైనదని.. అలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నామని.. దేశ వ్యాప్తంగా నదులు, పుణ్యక్షేత్రాలు, అన్ని గ్రామాల నుంచి పుట్టమన్ను, నీళ్లు తెప్పించి హడావుడి చేశారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ ఆవరణలోని మట్టిని తెచ్చి చంద్రబాబుకు అప్పగించారు. కానీ అదంతా శంకుస్థాపన సమయం వరకే. ఇప్పుడక్కడ పరిస్థితి మరోలా ఉంది.
దేశంలోని పుణ్యక్షేత్రాలు, నదులు, రాష్ట్రంలోని గ్రామాల నుంచి తెచ్చిన మట్టి, జలాలను ప్రతిష్టించిన చోట ఇప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. శంకుస్థాపన చేసిన ప్రాంతం మందు, విందుల కేంద్రంగా మారింది. ఆ ప్రాంతంలో మూడు, నాలుగు చోట్ల పేకాట ఆడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పక్కనే తాగి పడేసిన మద్యం బాటిళ్లు, గ్లాసులు, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయాల్లో అసాంఘీక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన బారీకేడ్ల మధ్యలో ప్రతిరోజూ పలువురు పేకాట ఆడుతున్నారు. అరకొరగా కానిస్టేబుల్ స్థాయి భద్రత ఏర్పాటు చేయడంతో వారేమీ చేయలేకపోతున్నారు. శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పవిత్ర పర్యాటక స్థలంగా మారుస్తామన్న చంద్రబాబు ఆదిశగా ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఇక ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగంగానీ శంకుస్థాపన తర్వాత ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందన్న విషయం మర్చిపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పవిత్రమైన స్థలంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.