రామోజీ అంటే భయమా ?
కాల్‌మనీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ పదేపదే ఈనాడు పత్రిక కథనాలను ప్రస్తావించారు. కాల్‌మనీ గురించి ఈనాడులో వచ్చిన కథనాలను వరుసపెట్టి చదివి వినిపించారు. ఆ కథనాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కల్గించేవే. ఒకవేళ జగన్ సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించి ఉంటే టీడీపీ సభ్యులు తప్పనిసరిగా ఎదురుదాడి చేసేవారు. సాక్షిలో కథనాలన్నీ మీరు రాయించుకున్నవే అని అటాక్ చేసేవారు. కానీ ఈనాడు పత్రికలో కథనాలను ప్రస్తావించిన సమయంలో టీడీపీ నేతలు ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయారు. […]
కాల్‌మనీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ పదేపదే ఈనాడు పత్రిక కథనాలను ప్రస్తావించారు. కాల్‌మనీ గురించి ఈనాడులో వచ్చిన కథనాలను వరుసపెట్టి చదివి వినిపించారు. ఆ కథనాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కల్గించేవే. ఒకవేళ జగన్ సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించి ఉంటే టీడీపీ సభ్యులు తప్పనిసరిగా ఎదురుదాడి చేసేవారు. సాక్షిలో కథనాలన్నీ మీరు రాయించుకున్నవే అని అటాక్ చేసేవారు. కానీ ఈనాడు పత్రికలో కథనాలను ప్రస్తావించిన సమయంలో టీడీపీ నేతలు ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయారు. కనీసం వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు. జగన్ సొంత వ్యాఖ్యలు చేసిన సమయంలో మాత్రమే కౌంటర్ ఇచ్చారు. ”ఈనాడు మీ గెజిట్”లోనే కాల్‌మనీ గురించి కథనాలు వచ్చాయంటూ జగన్ పదేపదే చెప్పారు. అయినా టీడీపీ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది. చంద్రబాబు కూడా ఈనాడు కథనాల ప్రస్తావనను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని తెలుస్తోంది.
సభ వాయిదా పడిన అనంతరం లాబీల్లో ఈ అంశంపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. కాల్‌మనీ గురించి అన్ని పత్రికల్లో కథనాలు వచ్చినా వైసీపీ తెలివిగా ”ఈనాడు” కథనాలనే సభలో ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈనాడులో వచ్చింది నిజం అయినా కాకపోయినా ఖండించే సాహసం చేయలేమన్నది టీడీపీ నేతల ఆఫ్‌లైన్ టాక్. అదే జగన్ సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను ప్రస్తావించి ఉంటే తమ తడాఖా చూపించే వారిమంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ముందే పసిగట్టిందని అందుకే సభలో జగన్ ప్రతిసారి ఈనాడు పత్రిక కథనాలను ప్రస్తావించి టీడీపీ మారుమాట్లాడకుండా చేశారని చెబుతున్నారు.click to read: రంగనాథ్ ఆఖరి ఎస్‌ఎమ్‌ఎస్
ఇక్కడ మరో ఆసక్తికలిగించే అంశం ఏమిటంటే కాల్‌మనీపై కథనాలు రాసిన మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని అసెంబ్లీ వేదిక సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే మిగిలిన ప్రతికలు, టీవీ చానళ్లతో పాటు ఈనాడు పత్రిక, ఈటీవీ చానల్స్‌కు కూడా నోటీసులు పంపుతారా అన్నది ఆసక్తికరం. అసలు ఈనాడుకు నోటీసులు జారీ చేసే సాహసం చంద్రబాబు చేస్తారా?. అటు.. ఇటీవల రామోజీరావును జగన్ కలిసిన నేపథ్యంలోనూ ఈనాడు పత్రికను జగన్ పదేపదే టీడీపి గెజిట్ అనడం కూడా ఆసక్తికరమే!.