తప్పు చేశా... క్షమించండి
దర్శకుడు వివి వినాయక్ క్షమాపణ చెప్పారు. ”అఖిల్” సినిమా ఘోరంగా దెబ్బతినడంపై ఆయన ఏలూరులో స్పందించారు. అఖిల్ సినిమా విషయంలో ప్యాన్స్, చిత్ర పరిశ్రమ కుటుంబసభ్యులను తనను క్షమించాలని కోరారు. మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని అన్నారు. హీరో అఖిల్ ఎంతో టాలెంట్ చూపినా సినిమా మాత్రం ఫలితాన్ని సాధించలేకపోయిందన్నారు. పరిశ్రమలో రాజమౌళి తప్ప ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తున్నారని… అఖిల్ విషయంలో తాను కూడా ఇప్పుడు తప్పు చేశానని వినాయక్ చెప్పారు. […]

దర్శకుడు వివి వినాయక్ క్షమాపణ చెప్పారు. ”అఖిల్” సినిమా ఘోరంగా దెబ్బతినడంపై ఆయన ఏలూరులో స్పందించారు. అఖిల్ సినిమా విషయంలో ప్యాన్స్, చిత్ర పరిశ్రమ కుటుంబసభ్యులను తనను క్షమించాలని కోరారు. మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని అన్నారు. హీరో అఖిల్ ఎంతో టాలెంట్ చూపినా సినిమా మాత్రం ఫలితాన్ని సాధించలేకపోయిందన్నారు.
పరిశ్రమలో రాజమౌళి తప్ప ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తున్నారని… అఖిల్ విషయంలో తాను కూడా ఇప్పుడు తప్పు చేశానని వినాయక్ చెప్పారు. త్వరలోనే ఓ మంచి హిట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తానన్నారు. అఖిల్ చిత్రం కథ కొత్తగా అనిపించి ముందుకెళ్లామని అక్కడే తప్పు జరిగిందన్నారు.