అమరావతి వెంటపడ్డ కేవీపీ
ప్రకృతి విపత్తులు సంభంవించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారంటూ ఇటీవల కేంద్ర పర్యావరణశాఖకు లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఇప్పుడు ప్రధానికి లెటర్ రాశారు. అమరావతి వద్ద రాజధాని నిర్మాణంపై జోక్యం చేసుకోవాలని కోరారు. చెన్నై వరదలు చూసిన తర్వాత కూడా అక్కడ రాజధాని సబబు కాదన్నారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా ఉండేలా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. […]

ప్రకృతి విపత్తులు సంభంవించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారంటూ ఇటీవల కేంద్ర పర్యావరణశాఖకు లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఇప్పుడు ప్రధానికి లెటర్ రాశారు. అమరావతి వద్ద రాజధాని నిర్మాణంపై జోక్యం చేసుకోవాలని కోరారు. చెన్నై వరదలు చూసిన తర్వాత కూడా అక్కడ రాజధాని సబబు కాదన్నారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా ఉండేలా రాజధాని నిర్మాణం జరగాలన్నారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో పర్యావరణ, ఆహార భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. గుంటూరు, విజయవాడ, తెనాలి కలిపినా 20లక్షల కంటే తక్కువ జనాభా ఉందని… ఇలాంటే చోటే ఏఏ అరాచకాలు జరుగుతున్నాయో చూస్తున్నామని… వాటిని గమనించకుండా 8వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని కడుతామనడం ఎంతవరకు సరైనదో అర్థం కావడం లేదని విమర్శించారు కేవీపీ.