రాజ్యంపైనే జేసీ రుసరుస
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యమే మన దేశానికి గుదిబండ అని అంటున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం శుద్ధ దండగని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక పాలన రావాలని ఆకాంక్షించారు. సర్వసైన్యాధక్షుడి చేతిలోకి దేశం వెళ్తే అప్పుడు బాగుపడుతుందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు , ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేస్తాయనుకోవడం ఒక భ్రమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని విజ్ఞప్తులు చేసినా […]
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యమే మన దేశానికి గుదిబండ అని అంటున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం శుద్ధ దండగని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక పాలన రావాలని ఆకాంక్షించారు. సర్వసైన్యాధక్షుడి చేతిలోకి దేశం వెళ్తే అప్పుడు బాగుపడుతుందన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు , ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేస్తాయనుకోవడం ఒక భ్రమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్ కూడా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు జేసీ.