Telugu Global
Others

బెయిల్‌... అంతా ఆరు నిమిషాల్లోనే

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరైంది. ఉత్కంఠ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ నేతలు వెంటరాగా తల్లీ కుమారుడు ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు పరిసరాలు కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. విచారణ అనంతరం న్యాయమూర్తి చెరో రూ.50 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. సోనియా గాంధీకి మన్మోహన్‌సింగ్ షూరిటీ ఇవ్వగా… రాహుల్‌కు ఆయన సోదరి ప్రియాంకగాంధీ షూరిటీ సమర్పించారు. ఈ ప్రక్రియంతా కేవలం 6నిమిషాల్లోనే ముగిసిపోయింది. ఇదే […]

బెయిల్‌... అంతా ఆరు నిమిషాల్లోనే
X

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరైంది. ఉత్కంఠ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ నేతలు వెంటరాగా తల్లీ కుమారుడు ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు పరిసరాలు కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. విచారణ అనంతరం న్యాయమూర్తి చెరో రూ.50 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. సోనియా గాంధీకి మన్మోహన్‌సింగ్ షూరిటీ ఇవ్వగా… రాహుల్‌కు ఆయన సోదరి ప్రియాంకగాంధీ షూరిటీ సమర్పించారు. ఈ ప్రక్రియంతా కేవలం 6నిమిషాల్లోనే ముగిసిపోయింది. ఇదే కేసులో మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత వెంటనే సోనియా, రాహుల్, ప్రియాంక కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, కేసు వాదించిన కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వీ మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్ కు కోర్టు ఎలాంటి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. విదేశాలకు వెళ్లకుండా పాస్ పోర్టు సీజ్ చేయాలన్న సుబ్రహ్మణ్య స్వామి వాదనను జడ్జి తోసిపుచ్చారని సిబల్ తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేశారని.. ఆరోజు మధ్యాహ్నం మరోసారి పటియాలా కోర్టుకు సోనియా, రాహుల్ హాజరుతారని తెలిపారు.

click to read:‘నేషనల్ హెరాల్డ్’ కేసు గురించి సింపుల్‌గా చెప్పాలంటే

First Published:  19 Dec 2015 9:56 AM IST
Next Story