బాలయ్యకు జూ. ఎన్టీఆర్ క్షమాపణ
నందమూరి ఫ్యామిలీ ఐక్యతను కోరుకుంటున్న ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే అంశమే. చాలాకాలంగా దూరదూరంగా ఉంటున్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ తగ్గుతోంది. ఇందుకు జూ. ఎన్టీఆరే చొరవ తీసుకున్నట్టు ఒక ప్రముఖ ఆంగ్లదినపత్రిక కథనాన్ని ప్రచురించింది. బాలయ్య, జూ. ఎన్టీఆర్‌లకు సన్నిహితంగా ఉండే ఒక పొలిటిషన్ వీరి మధ్య మీడియేటర్‌గా వ్యవహరించినట్టు ఆంగ్ల పత్రిక చెబుతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేసిన ఎన్టీఆర్ గతంలో జరిగిన పరిణామాలపై బాలయ్యకు తొలుత సారీ చెప్పారు. అంతేకాకుండా […]
నందమూరి ఫ్యామిలీ ఐక్యతను కోరుకుంటున్న ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే అంశమే. చాలాకాలంగా దూరదూరంగా ఉంటున్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ తగ్గుతోంది. ఇందుకు జూ. ఎన్టీఆరే చొరవ తీసుకున్నట్టు ఒక ప్రముఖ ఆంగ్లదినపత్రిక కథనాన్ని ప్రచురించింది. బాలయ్య, జూ. ఎన్టీఆర్‌లకు సన్నిహితంగా ఉండే ఒక పొలిటిషన్ వీరి మధ్య మీడియేటర్‌గా వ్యవహరించినట్టు ఆంగ్ల పత్రిక చెబుతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేసిన ఎన్టీఆర్ గతంలో జరిగిన పరిణామాలపై బాలయ్యకు తొలుత సారీ చెప్పారు. అంతేకాకుండా ఒకే టైమ్‌లో రిలీజ్ అయ్యేందుకు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్ సిద్ధమవుతున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. డిక్టేటర్ కోసం తన సినిమాను వారం పాటు వాయిదా వేస్తానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కథనం. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు బాలకృష్ణ కూడా వస్తారని తెలుస్తోంది.
click to read: ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య!
బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్యాప్ పెరిగిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌కు కాస్త దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయంలో నెగిటివ్ ప్రచారానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య, ఎన్టీఆర్ కలయిక వల్ల ఇరువురికి మంచి జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. click to read: బయటపడ్డ రూ. 50 కోట్ల లక్ష్మీ విగ్రహం, సీఎంకు అందజేత