Telugu Global
NEWS

హిజ్రాల‌ను బీసీల్లో క‌లపొద్దు

హిజ్రాల‌ను బీసీ జాబితాలో చేర్చాల‌న్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అప్పుడే వ్య‌తిరేక‌త మొద‌లైంది. గ‌తంలో అనాథ‌ల‌ను బీసీ కులాల్లో చేర్చిన సీఎం నిర్ణ‌యాన్ని స‌ర్వ‌త్రా స్వాగ‌తించారు. కానీ ఇప్పుడు హిజ్రాల‌పై తీసుకున్న నిర్ణ‌యం క్ర‌మంగా వేడి రాజేస్తోంది. హిజ్రాల‌ను బీసీ జాబితాలో చేరిస్తే త‌మ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని బీసీ సంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో మంత్రి జోగురామ‌న్న‌, సీఎం కేసీఆర్ తీరును వారు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.  హిజ్రాలు స‌మాజంలో అనేక ఇబ్బందులు […]

హిజ్రాల‌ను బీసీల్లో క‌లపొద్దు
X
హిజ్రాల‌ను బీసీ జాబితాలో చేర్చాల‌న్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అప్పుడే వ్య‌తిరేక‌త మొద‌లైంది. గ‌తంలో అనాథ‌ల‌ను బీసీ కులాల్లో చేర్చిన సీఎం నిర్ణ‌యాన్ని స‌ర్వ‌త్రా స్వాగ‌తించారు. కానీ ఇప్పుడు హిజ్రాల‌పై తీసుకున్న నిర్ణ‌యం క్ర‌మంగా వేడి రాజేస్తోంది. హిజ్రాల‌ను బీసీ జాబితాలో చేరిస్తే త‌మ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని బీసీ సంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో మంత్రి జోగురామ‌న్న‌, సీఎం కేసీఆర్ తీరును వారు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు.
హిజ్రాలు స‌మాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం త‌మ‌కూ తెలుసున్నారు. కావాలంటే వారికి 2 శాతం ప్ర‌త్యేక‌ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అంతేకానీ, వారిని తీసుకువ‌చ్చి బీసీ జాబితాలో చేర్చాల‌న్న నిర్ణ‌యం స‌రికాద‌ని స్ప‌ష్టం చేశారు. హిజ్రాల‌ను బీసీల్లో చేరిస్తే.. బీసీలంద‌రిని హిజ్రాలు అనుకునే ప్ర‌మాద‌ముంద‌ని, ఇది బీసీ కులాల‌ను అవ‌మానించిన‌ట్లేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఈ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆర్‌. కృష్ణ‌య్య త‌దిత‌రులు డిమాండ్ చేశారు. హిజ్రాలను బీసీల్లో చేరిస్తే.. న్యాయ‌ప‌రంగా, చ‌ట్ట‌ప‌రంగా చెల్లుబాటు కావని పేర్కొన్నారు.
First Published:  18 Dec 2015 10:29 AM IST
Next Story