ఇది బాజీరావు మస్తానీ విషయం
రామ్ లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్ గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్ లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్ గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్ […]
రామ్ లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్ గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్ లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్ గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్ తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. విజువల్ గా ఆకట్టుకున్నా.. కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడు. హిస్టారికల్ వార్ డ్రామాకు కావాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచింది.