Telugu Global
Others

కర్నాటకలో రహస్య అణు పట్టణం?

భారత్‌దేశం తన అణు ఆయుధాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదటుపెట్టిందా?. ఇందులో భాగంగా కర్నాటకలో రహస్య న్యూక్లియర్ సిటీని నిర్మిస్తోందా?. అమెరికాకు చెందిన ”ఫారిన్ పాలసీ” అనే ఒక అంతర్జాతీయ పత్రిక మాత్రం అవునంటోంది. కర్నాటకలోని చిల్లకెరిలో భారత్‌ భారీ స్థాయిలో న్యూక్లియర్ సిటీని నిర్మిస్తోందంటూ భారీ కథనాన్ని రాసింది. విదేశీ వ్యవహారాలు, పాలసీలపై ఈ పత్రిక ప్రముఖంగా స్టోరీలను ప్రచురిస్తుంటుంది. 2017లో ఈ అణుకేంద్రం నిర్మాణం పూర్తవుతుందని సదరు మేగజైన్ చెబుతోంది. చెల్లకెరిలో మారుమూల గిరిజన ప్రాంతంలో […]

కర్నాటకలో రహస్య అణు పట్టణం?
X

భారత్‌దేశం తన అణు ఆయుధాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదటుపెట్టిందా?. ఇందులో భాగంగా కర్నాటకలో రహస్య న్యూక్లియర్ సిటీని నిర్మిస్తోందా?. అమెరికాకు చెందిన ”ఫారిన్ పాలసీ” అనే ఒక అంతర్జాతీయ పత్రిక మాత్రం అవునంటోంది. కర్నాటకలోని చిల్లకెరిలో భారత్‌ భారీ స్థాయిలో న్యూక్లియర్ సిటీని నిర్మిస్తోందంటూ భారీ కథనాన్ని రాసింది. విదేశీ వ్యవహారాలు, పాలసీలపై ఈ పత్రిక ప్రముఖంగా స్టోరీలను ప్రచురిస్తుంటుంది. 2017లో ఈ అణుకేంద్రం నిర్మాణం పూర్తవుతుందని సదరు మేగజైన్ చెబుతోంది. చెల్లకెరిలో మారుమూల గిరిజన ప్రాంతంలో ఈ నిర్మాణం సాగుతోందని వెల్లడించింది. పక్కలోబల్లెంలా ఉన్న చైనా, పాక్‌లకు సవాల్‌గా అణుఆయుధాలను పెంచుకునేందుకు భారత్ ఈ న్యూక్లియర్ సిటీ నిర్మిస్తుండవచ్చని అమెరికా మేగజైన్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు కూడా ధృవీకరిస్తున్నారంటూ పేర్లు వెల్లడించకుండా కొందరు అమెరికా అధికారుల స్టేట్‌మెంట్లను ”ఫారిన్ పాలసీ” మేగజైన్ ప్రచురించింది.

First Published:  18 Dec 2015 9:03 AM IST
Next Story