చోటామేస్త్రీపై ముఠామేస్త్రీ నిర్ణయం?
రామ్ చరణ్‌తో రచ్చ తరువాత పవన్ కల్యాణ్‌తో బెంగాల్ టైగర్ పేరుతో సినిమా చేద్దామనుకున్న సంపత్ నందికి నిరాశ తప్పలేదు. అయినా మనోడు మెగాకాంపౌండ్ హీరోలతో టచ్‌లోనే ఉన్నాడు. ఎలాగైనా వారితోనే మరోసారి సినిమా తీయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే బెంగాల్ టైగర్ సినిమా ఫర్వాలేదు అనిపించుకోవడంతో మరోసారి చిరంజీవి గడప తొక్కాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా చోటా మేస్త్రీ అనే కథతో మెగాస్టార్ ఇంటికి వెళ్లాడు. తనను తప్పకుండా ఆదరిస్తారనుకున్న సంపత్ నందికి మెగాస్టార్ […]
BY sarvi18 Dec 2015 12:32 AM IST
X
sarvi Updated On: 18 Dec 2015 6:43 AM IST
రామ్ చరణ్‌తో రచ్చ తరువాత పవన్ కల్యాణ్‌తో బెంగాల్ టైగర్ పేరుతో సినిమా చేద్దామనుకున్న సంపత్ నందికి నిరాశ తప్పలేదు. అయినా మనోడు మెగాకాంపౌండ్ హీరోలతో టచ్‌లోనే ఉన్నాడు. ఎలాగైనా వారితోనే మరోసారి సినిమా తీయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే బెంగాల్ టైగర్ సినిమా ఫర్వాలేదు అనిపించుకోవడంతో మరోసారి చిరంజీవి గడప తొక్కాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా చోటా మేస్త్రీ అనే కథతో మెగాస్టార్ ఇంటికి వెళ్లాడు. తనను తప్పకుండా ఆదరిస్తారనుకున్న సంపత్ నందికి మెగాస్టార్ ఇంతవరకూ ఏ నిర్ణయమూ చెప్పలేదంట.
బ్రూస్ లీతో మారిన సమీకరణాలు!
బ్రూస్ లీ సినిమా ఘోర పరాజయం పాలవడం, రామ్‌ను వరుసగా ఫ్లాపులు వెంటాడుతుండటంతో చిరంజీవి రంగంలోకి దిగారు. అంతకముందు కథ నేరుగా రామ్ చరణ్ కే చెప్పేవారు. అతను ఓకే చేస్తే ఫైనల్ డెసిషన్ కోసం చిరంజీవికి వినిపించేవారు. ఇప్పుడు సీన్ మారింది. ముందు చిరంజీవికి కథలు వినిపించి అతను ఓకే చేస్తేనే తరువాత రామ్ దగ్గరకి వెళుతున్నాయట. చోటా మేస్త్రీ కథ విన్న చిరంజీవి వెంటనే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని సమాచారం. తరువాత చెప్తాను! అంటూ సంపత్ నందిని పంపించేశాడంట. మెగా హీరోతో మరోసారి హిట్ సినిమా తీద్దామనుకున్న సంపత్ నందికి మరికొంతకాలం ఎదురుచూపులు తప్పేలా లేవు!
Next Story