రాష్ట్రం కోసం డాక్టర్ అవుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గౌరవడాక్టరేట్ ఇచ్చేందుకు అమెరికాకు చెందిన షికాగో స్టేట్ యూనివర్శిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వర్సిటీ అధ్యక్షుడు వాట్సన్ నుంచి చంద్రబాబుకు లేఖ అందింది. సామాజిక- ఆర్థిక సంస్కరణలతో రైతులు, మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు విశేష కృషి, హుద్‌హుద్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విజన్ 2029, విజన్ 2050లతో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం వంటి అంశాలను చూసి ఈ గౌరవడాక్టరేట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గౌరవడాక్టరేట్ ఇచ్చేందుకు అమెరికాకు చెందిన షికాగో స్టేట్ యూనివర్శిటీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వర్సిటీ అధ్యక్షుడు వాట్సన్ నుంచి చంద్రబాబుకు లేఖ అందింది. సామాజిక- ఆర్థిక సంస్కరణలతో రైతులు, మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు విశేష కృషి, హుద్‌హుద్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విజన్ 2029, విజన్ 2050లతో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం వంటి అంశాలను చూసి ఈ గౌరవడాక్టరేట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్దిని దృష్టిలో ఉంచుకునే తానీ డాక్టరేట్ స్వీకరించబోతున్నానని చెప్పారు. గతంలోనూ చాలా యూనివర్శిటీలో గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకువచ్చినా అప్పట్లో అవసరం లేదనిపించిందని చెప్పారు. అయితే ఎంతో ప్రఖ్యాతిగాంచిన షికాగో యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ తీసుకుంటే అమెరికాలో మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుందని చెప్పారు. దాని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని వివరించారు.