హైదరాబాద్‌కు గూగుల్- ఐటీ మంత్రికి బాబు క్లాస్
ఎక్కడైనా ఓ పెద్ద కంపెనీ వస్తే.. దాని తర్వాత చిన్న కంపెనీలు క్యూ కడతాయి. అందుకు నిదర్శనం హైదరాబాద్ లో హైటెక్ సిటీ. ఆతర్వాత గూగుల్ సంస్థ ఏర్పాటు. ఇవి రావడంతో ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ లోనే గూగుల్ మరో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ ఫుల్ కుషీగా ఉన్నారు. కానీ అదే ఏపీలో ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి మాత్రం అధినేత, సీఎం చంద్రబాబు నుంచి […]
ఎక్కడైనా ఓ పెద్ద కంపెనీ వస్తే.. దాని తర్వాత చిన్న కంపెనీలు క్యూ కడతాయి. అందుకు నిదర్శనం హైదరాబాద్ లో హైటెక్ సిటీ. ఆతర్వాత గూగుల్ సంస్థ ఏర్పాటు. ఇవి రావడంతో ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ లోనే గూగుల్ మరో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ ఫుల్ కుషీగా ఉన్నారు. కానీ అదే ఏపీలో ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి మాత్రం అధినేత, సీఎం చంద్రబాబు నుంచి చివాట్లు పడ్డాయట.
దీనికి తోడు అన్ని చానళ్లు, పత్రికలు హైదరాబాద్ లో గూగుల్ సంస్థ ఏర్పాటు వార్తపై ఫుల్ హైప్ ఇచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నో ఎలక్ట్రానిక్ , సెల్ ఫోన్ కంపెనీలను రప్పించినా గూగుల్ విషయంలో మాత్రం వెనకబడిపోయానని మంత్రులతో అన్నట్టు సమాచారం. ఈ విషయంలో ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రమాణ స్వీకారం చేసి ఏడాదిన్నర కాలం దాటింది. రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చేలా ప్రయత్నించావా? అని పల్లెను ప్రశ్నించారట. తన శాఖకు సంబంధించిన విషయాలను కూడా చంద్రబాబే చూస్తూ వస్తుండడంతో పల్లె ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారట.
ఏపీకి గూగుల్ సంస్థ వచ్చి ఉంటే దాంతోపాటు మరిన్ని పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవని చంద్రబాబు అన్నారట. ఇప్పటికైనా మైక్రోసాఫ్ట్, డెలాయిట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఎమ్ లాంటి ఐటీ సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేయాలని సూచించారట.