జడ్డి కొడుకుపై టీ మంత్రి గన్‌మెన్ దాడి, సర్జరీ
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గన్ మెన్ … రంగారెడ్డి జిల్లా ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు కుమారుడిపై దాడి చేశాడు. దాడిలో జడ్జి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెవి భాగంలో గాయమవడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని జడ్జిస్ క్యార్టర్స్‌కు సమీపంలో గురువారం రాత్రి 8.30కు ఈ దాడి ఘటన జరిగింది. పుస్తకాలు కొనుగోలు చేసి బైక్‌పై వస్తున్న గణేష్ న్యాయమూర్తుల నివాస ప్రాంతానికి రాగానే తన ఇంటికి వెళ్లేందుకు […]
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గన్ మెన్ … రంగారెడ్డి జిల్లా ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు కుమారుడిపై దాడి చేశాడు. దాడిలో జడ్జి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెవి భాగంలో గాయమవడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని జడ్జిస్ క్యార్టర్స్‌కు సమీపంలో గురువారం రాత్రి 8.30కు ఈ దాడి ఘటన జరిగింది.
పుస్తకాలు కొనుగోలు చేసి బైక్‌పై వస్తున్న గణేష్ న్యాయమూర్తుల నివాస ప్రాంతానికి రాగానే తన ఇంటికి వెళ్లేందుకు యూటర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో మంత్రి కాన్వాయ్ మరోదారి నుంచి మలుపు తిరిగి దూసుకొచ్చింది. ఈ సమయంలో గణేష్ బైక్‌ను కాన్వాయ్‌లోని ఒక వాహనం తాకబోయింది. ఇంతలోనే వాహనం దిగి వచ్చిన మంత్రి గన్‌మెన్ అందరూ చూస్తుండగానే తీవ్రస్థాయిలో జడ్జి కుమారుడు గణ్‌ష్‌పై దాడి చేశాడు. రక్తమొచ్చేలా కొట్టి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే గణేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత దృష్ణ్యా సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దాడి జరిగిన సమయంలో మంత్రి వద్ద గన్‌మెన్‌లుగా కసి రాము, చాందు డ్యూటీలో ఉన్నారు. రాత్రి 11 గంట సమయంలో మంత్రి గన్‌మెన్‌పై కేసు నమోదు చేశారు.