Telugu Global
Others

1110 ఓట్లు " 100కోట్లు... ఖరీదైన ఎమ్మెల్సీ

1110 ఓట్లు,  100 కోట్ల రూపాయల ఖర్చు. అవును ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై జిల్లా ప్రజలు చెప్పుకుంటున్న మాటలివి. కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న చిన్నపరెడ్డి ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన వారే. ఇద్దరూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా చూపించిన ఆస్తుల వివరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్థిర, చరాస్తుల విలువ […]

1110 ఓట్లు  100కోట్లు... ఖరీదైన ఎమ్మెల్సీ
X
1110 ఓట్లు, 100 కోట్ల రూపాయల ఖర్చు. అవును ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై జిల్లా ప్రజలు చెప్పుకుంటున్న మాటలివి. కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న చిన్నపరెడ్డి ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన వారే. ఇద్దరూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా చూపించిన ఆస్తుల వివరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్థిర, చరాస్తుల విలువ 251 కోట్ల 18 లక్షలుగా చూపించారు. లీగల్‌గానే ఇన్ని ఉంటే పరోక్షంగానూ, బినామీ పేర్లతోనూ ఇంతకంటే ఎక్కువగానే ఉంటాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి కూడా ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల విలువ 150 కోట్ల 8లక్షలు అని చూపారు. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న ఇద్దరూ డబ్బు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు.
ఇదే ఇప్పుడు జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ల పంట పండుతోంది. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 1110 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ గుప్తుపై గెలిచిన వారే 542 మంది ఉన్నారు. ఇక టీఆర్ఎస్‌ నుంచి గెలిచిన వారు కేవలం 138 మంది మాత్రమే. అయినా టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తమ బలం 650కి చేరిందని గెలుపు తమదేనని ధీమాగా చెబుతున్నారు. అటు కోమటిరెడ్డి కూడా గెలుపు తనదేనని తమ ఓటర్లను కాపాడుకుని గెలుస్తామంటున్నారు. దీంతో 1110 మంది ఓటర్లకు ఒక్కో పార్టీ నుంచి లక్షల్లో నగదు ముట్టిందని తెలుస్తోంది.
అయితే అటూ ఇటూ గేమ్ ఆడే వారికి ఎంతైనా ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరికి 10లక్షల తోపాటు నెల రోజులపాటు విహార యాత్రలు హామీ ఇస్తున్నారట. ఈ లెక్కప్రకారం చూస్తే ఒక్కో అభ్యర్థి కనీసం 800మందికి 5లక్షల చొప్పున ముట్టజెప్పినా 40కోట్లు దాటుతుంది. ఇక విహార యాత్రలు, క్యాంపులు, గిఫ్ట్ లు అన్నీ లెక్కేస్తే మరో 10కోట్లు అవ్వొచ్చచు. అంటే సగటున ఒక్కో అభ్యర్థి 50 కోట్లు ఖర్చు చేసినా ఇద్దూరు 100 కోట్లకు పైనే ఖర్చు చేసినట్టే. 1110 ఓట్లు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకే ఇంత ఖర్చు చేసిన ఎన్నిక ఏదీ అంటే ఇదేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
First Published:  17 Dec 2015 7:34 AM IST
Next Story