Telugu Global
Others

మేయర్ అనురాధ కేసు- శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్య

చిత్తూరు మేయర్‌ అనురాధ దంపతుల కేసులో విచారణకు హాజరైన 36వ వార్డు కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మేయర్ దంపతుల హత్య కేసులో విచారణ కోసం బుధవారం సాయంత్రం శివప్రసాద్‌ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు. రాత్రంతా విచారించారు. ఉదయం ఇంటికి వచ్చిన శివప్రసాద్ రెడ్డి నేరుగా తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నారు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. పోలీసుల వేధిస్తున్నారని మేయర్ కేసులో కాకపోయినా మరో కేసులో ఇరికిస్తామంటున్నారని ఆందోళన చెందారు. మానసిక వేధింపులు […]

మేయర్ అనురాధ కేసు- శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్య
X

చిత్తూరు మేయర్‌ అనురాధ దంపతుల కేసులో విచారణకు హాజరైన 36వ వార్డు కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మేయర్ దంపతుల హత్య కేసులో విచారణ కోసం బుధవారం సాయంత్రం శివప్రసాద్‌ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు. రాత్రంతా విచారించారు. ఉదయం ఇంటికి వచ్చిన శివప్రసాద్ రెడ్డి నేరుగా తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నారు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. పోలీసుల వేధిస్తున్నారని మేయర్ కేసులో కాకపోయినా మరో కేసులో ఇరికిస్తామంటున్నారని ఆందోళన చెందారు. మానసిక వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వెల్లడించారు. షుగర్‌, బీపీ రావడంతో ఏడాదిగా ఆరోగ్యపరంగానూ శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పోలీసుల నుంచి కూడా ఒత్తిళ్లు అధికమవడంతో శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ప్రధాన అనుచరుడు. 36 వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. శివప్రసాద్‌ రెడ్డి కుటుంబసభ్యులను సీకే బాబు పరామర్శించారు.

First Published:  17 Dec 2015 7:41 AM IST
Next Story