అమరావతిలో డ్రాగన్ వంతు
అమరావతి నిర్మాణం చేసేందుకు సవాలక్ష షరతులు పెట్టి ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ షాకిచ్చిన వేళ ఇప్పుడు చైనా వైపు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. చైనా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. చైనీస్ ప్రావిన్స్ గుయ్జౌ అమరావతి నిర్మాణంలో సహకారం అందించేందుకు ఉత్సాహం చూపుతోంది. సమన్వయం, చర్చల కోసం ఒక కమిటీ వేయాలని కూడా రెండు ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. చైనీస్ ప్రావిన్స్ గుయ్జౌ ప్రతినిధులతో మున్సిపల్ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ చర్చలు జరుపుతోంది. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అవతలి వైపు […]
అమరావతి నిర్మాణం చేసేందుకు సవాలక్ష షరతులు పెట్టి ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ షాకిచ్చిన వేళ ఇప్పుడు చైనా వైపు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. చైనా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. చైనీస్ ప్రావిన్స్ గుయ్జౌ అమరావతి నిర్మాణంలో సహకారం అందించేందుకు ఉత్సాహం చూపుతోంది. సమన్వయం, చర్చల కోసం ఒక కమిటీ వేయాలని కూడా రెండు ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి. చైనీస్ ప్రావిన్స్ గుయ్జౌ ప్రతినిధులతో మున్సిపల్ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ చర్చలు జరుపుతోంది. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అవతలి వైపు నుంచి మంచి సానుకూలత వ్యక్తమవుతోందని నారాయణ బృందం చెబుతోంది. విశాఖ వేదికగా జనవరిలో జరగనున్న సమ్మిట్‌కు కూడా చైనా పారిశ్రామికవేత్తల బృందాన్ని ఏపీ ప్రతినిధులు ఆహ్వానించారు.