Telugu Global
Others

భారత్ అల్ ఖాయదా అధిపతి అరెస్టు

భారత్ లో అల్ ఖాయదా అధిపతితో పాటు మరో తీవ్రవాదిని బుధవారం అరెస్టు చేశారు. దిల్లీ ఉత్తర ప్రాంతంలోని సీలం పూర్ లో 41 ఏళ్ల మహమ్మద్ ఆసిఫ్ ను అరెస్టు చేశారు. ఆయ్న భారత్ లో అల్ ఖాయదా అధిపతిగా భావిస్తున్నారు. అబ్దుల్ రహమాన్ మరో తీవ్రవాదిని కటక్  లోని జగతాపూర్ వద్ద అరెస్టు చేశారు.  దిల్లీ పోలీసులు, ఒరిస్సా పోలీసులు ఉమ్మడిగా చేసిన దాడిలో అబ్దుల్ రహమాన్ పట్టుబడ్డారు. వీరిద్దరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల […]

భారత్ అల్ ఖాయదా అధిపతి అరెస్టు
X

భారత్ లో అల్ ఖాయదా అధిపతితో పాటు మరో తీవ్రవాదిని బుధవారం అరెస్టు చేశారు. దిల్లీ ఉత్తర ప్రాంతంలోని సీలం పూర్ లో 41 ఏళ్ల మహమ్మద్ ఆసిఫ్ ను అరెస్టు చేశారు. ఆయ్న భారత్ లో అల్ ఖాయదా అధిపతిగా భావిస్తున్నారు. అబ్దుల్ రహమాన్ మరో తీవ్రవాదిని కటక్ లోని జగతాపూర్ వద్ద అరెస్టు చేశారు. దిల్లీ పోలీసులు, ఒరిస్సా పోలీసులు ఉమ్మడిగా చేసిన దాడిలో అబ్దుల్ రహమాన్ పట్టుబడ్డారు. వీరిద్దరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఇద్దరి దగ్గరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఒక లాప్ టాప్, మౌలానా ఉమర్ రాసిన జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. రహమాన్ కు సౌదీ అరేబియా, పాకిస్తాన్, దుబాయ్ లోని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నారు. రహమాన్ కటక్ దగ్గరలోని తంగి ప్రాంతంలో మదర్సా నడిపేవాడు. కోల్ కతాలోని అమెరికన్ సెంటర్ మీద దాడి చేసినందుకు రహమాన్ సోదరుడు తాహిర్ అలీని 2001లో అరెస్టు చేశారు.

మహమ్మద్ ఆసిఫ్ 2013 జూన్ లో మరో ఇద్దరు యువకులతో కలిసి ఇరాన్ రాజధాని తెహ్రాన్ వెళ్లారు. అక్కడ వారు ఖాసిం ను కలుసుకున్నారు. అక్కడి నుంచి వారిని ఇరాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలోని సిస్తాన్ కు పంపించారు. ఆ తర్వాత ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి కాలినడకన పాకిస్తాన్ లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి దక్షిణ వజీరిస్తాన్ కు, ఆ తర్వాత ఉత్తర వజీరిస్తాన్ లోని సుమాలి వెళ్లారు. ఆసిఫ్ అక్కడ అంతకు ముందే పాకిస్తాన్ చేరుకున్న ఉస్మాన్ (మారుపేరు అసద్) కలిశాడు. భారత సంతతికి చెందిన తీవ్రవాది మౌలానా ఆసిమ్ ఉమర్ ను ఆసిఫ్ కు ఉస్మాన్ పరిచయం చేశాడు. అల్ ఖాయదా అధిపతి అల్ జవహరి వెంటనే ఆసిఫ్ ను భారత్ అల్ ఖాయదా విభాగం అధిపతిగా నియమించాడు.

వజీరిస్తాన్ లో ఆసిఫ్ కు మంచి శిక్షణ ఇచ్చారు. ఆసిఫ్ బస చేసిన చోటికి దగ్గరలోనే ఆ సమయంలో అమెరికా డ్రోన్లు తీవ్రవాద స్థావరాలపై విపరీతమైన దాడులు చేస్తున్నాయి. ఆ దాడుల్లోనే పాకిస్తాన్ లోని తెహ్రీక్-ఎ-తాలిబా నాయకుడు హకీముల్లా మసూద్ మృతి చెందాడు.

భారత్ లో అల్ ఖాయదా విభాగాన్ని 2014లో అల్ జవహరి స్వయంగా ఏర్పాటు చేశారు. ఆసిం ఉమర్ ను భారత్ లో అల్ ఖాయదా అధిపతిగా నియమించాలనుకున్నారు. మౌలానా ఉమర్ ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ నుంచి 1995లో పాకిస్తాన్ చేరుకున్నాడు. హర్కత్-ఉల్-ముజాహిదీన్ కార్యకర్తగా పని చేశాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ ద్వారా క్రమంగా భారత్ లో అల్ ఖాయదా అధిపతి స్థాయికి ఎదిగాడు.

భారత్ లో అల్ ఖాయదా అధిపతిగా ఉమర్ దక్షిణ ఆసియాలోని భారత్, పాకిస్తాన్, శ్రీ లంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెంపొందించే బాధ్యత తీసుకున్నాడు.

ఉమర్ ను భారత్ లో అల్ ఖాయదా అధిపతిగా నియమించిన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు రియాజ్ భక్తల్ అతనిని కలుసుకున్నాడు. భక్తల్ ఇప్పటికీ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

దిల్లీలో పట్టుబడ్డ ఉమర్ కు నమ్మిన బంటు. సామాజిక మాధ్యమం ద్వారా ఉమర్ ఆసిఫ్ తో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. తెహ్రాన్ లోని పవిత్ర స్థలాలు దర్శించే నెపంతో వీసా సంపాదించి ఆసిఫ్ తెహ్రాన్ చేరుకున్నాడు.

ఉమర్, ఖాసిం, ఉస్మాన్, ఆసిఫ్ మొదలైన వారందరూ ఉత్తర ప్రదేశ్ లోని సంభల్ జిల్లా దీపా సరాయ్ బస్తీకి చెందిన వారే.

ఆసిఫ్ మళ్లీ తెహ్రాన్ మార్గం లోనే భారత్ తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఇరాన్ భద్రతా దళాలు ఆసిఫ్ ను మెహ్రియాజ్ సరిహద్దులో నిర్బంధించాయి. అల్ ఖాయదా తో ఉన్న సంబంధాల వల్ల ఆసిఫ్ టర్కీ చేరాడు. వీసా గడువు ముగిసిన తర్వాత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే అతనిని దిల్లీ పంపించారు. ఓ గూఢచార విభాగం అందించిన సమాచారం ఆధారంగా దిల్లీ పోలీసులు వల పన్ని పోలీసులు ఆసిఫ్ ను నిర్బంధించారు.

First Published:  16 Dec 2015 9:00 PM GMT
Next Story