సిగ్గు.. సిగ్గు... సమర్ధతా ? మనవాడా?
మహిళల మానప్రాణాలు వడ్డీగా సాగిన విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ దర్యాప్తు నీరు గార్చే ప్రయ్నతాలు జరుగుతాయని చాలా మంది ఊహించారు. కానీ మరీ ఇంత బరితెగించినట్టుగా పబ్లిక్‌గా కేసును నీరుగారుస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపి… బాధితులు సైతం ధైర్యంగా ఫిర్యాదు చేసే వాతావరణం సృష్టించిన విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్‌ను సెలవుపై పంపడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. గత నెలలోనే సవాంగ్ లీవ్ కోసం దరఖాస్తు […]
మహిళల మానప్రాణాలు వడ్డీగా సాగిన విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ దర్యాప్తు నీరు గార్చే ప్రయ్నతాలు జరుగుతాయని చాలా మంది ఊహించారు. కానీ మరీ ఇంత బరితెగించినట్టుగా పబ్లిక్‌గా కేసును నీరుగారుస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపి… బాధితులు సైతం ధైర్యంగా ఫిర్యాదు చేసే వాతావరణం సృష్టించిన విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్‌ను సెలవుపై పంపడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. గత నెలలోనే సవాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇప్పుడు సెలవు మంజూరు అయిందని ప్రభుత్వం మీడియా ముందుకొచ్చి చెప్పుతోంది. ఆయన నిజంగానే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారే అనుకుందాం!. కానీ ..
ఈ పరిస్థితిలో సెలవు ఎలా మంజూరు చేస్తారు?. ఏదైనా విపత్తులు జరిగిన సమయంలో సెలవులో ఉన్న ప్రభుత్వ సిబ్బంది లీవ్‌లను రద్దు చేసి వెంటనే విధులకు హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం చాలాసార్లుచూశాం. ఇప్పుడు విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ అన్నది వరదలు, తుపానుల కంటే భయంకరమైన విపత్తే. అలాంటి కేసు విచారణ సమయంలో ఒక సీపీకి ఎలా సెలవు మంజూరు చేస్తారో చంద్రబాబుకు మాత్రమే తెలియాలి. ఒకవేళ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే కాల్ మనీ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున సెలవు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి ఉండేది. ఎంతో బాధ్యతయుతమైన సీపీ పదవిలో ఉన్న సవాంగ్ కూడా ఈ పరిస్థితిలో సెలవు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన చదివింది ఇంటర్మిడియట్ కాదు అత్యుత్తమ ఐపీఎస్.
సవాంగ్ స్థానంలో ఆయన కన్నా సమర్థుడైన సురేంద్రబాబును నియమిస్తున్నామని డీజీపీ రాముడు చెబుతున్నారు. అయితే విజయవాడలో మానాలు పోగొట్టుకున్న అక్కడి మహిళలకు ఇప్పుడు కావాల్సింది సమర్థత కాదు. నమ్మకం కలిగించే పోలీస్ కమిషనర్. అలాంటి నమ్మకం సవాంగ్‌లో కనిపించింది కాబట్టే చాలా మంది ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయగలిగారు. సవాంగ్ వెళ్లిపోయారు కాబట్టి ఇక ఏ మహిళ ఫిర్యాదు చేసేందుకు ముందుకురాకపోవచ్చు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదేగా. ఇకపై బెజవాడ బాధితులని ఆ కనకదుర్గమ్మే కాపాడాలి.