Telugu Global
Others

పరువుకోసం ప్లాన్‌ 'బి' రెడీచేసిన టిడిపి

విజయవాడలో నడిచిన కాల్‌ మనీ దందా తెలుగుదేశం పరువు తీసింది. పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నిజాయితీగా వ్యవహరించి నేరస్థుల అరెస్ట్‌లకు తెరతీశారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావడం – కాల్‌ మనీ వ్యాపారుల అకృత్యాలు ప్రజల్ని భయకంపితుల్ని చేసి తెలుగుదేశానికి చెడ్డపేరు రావడంతో నిజాయితీపరుడైన, విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే గౌతమ్‌ సవాంగ్‌పై పార్టీనేత విరుచుకుపడ్డట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ పోలీస్‌ అధికారిని సెలవుపై పంపేసి, అస్మదీయుణ్ణి ఆ సీట్లో కూర్చోపెట్టారు. అంతటితో […]

పరువుకోసం ప్లాన్‌ బి రెడీచేసిన టిడిపి
X

విజయవాడలో నడిచిన కాల్‌ మనీ దందా తెలుగుదేశం పరువు తీసింది. పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నిజాయితీగా వ్యవహరించి నేరస్థుల అరెస్ట్‌లకు తెరతీశారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావడం – కాల్‌ మనీ వ్యాపారుల అకృత్యాలు ప్రజల్ని భయకంపితుల్ని చేసి తెలుగుదేశానికి చెడ్డపేరు రావడంతో నిజాయితీపరుడైన, విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే గౌతమ్‌ సవాంగ్‌పై పార్టీనేత విరుచుకుపడ్డట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ పోలీస్‌ అధికారిని సెలవుపై పంపేసి, అస్మదీయుణ్ణి ఆ సీట్లో కూర్చోపెట్టారు. అంతటితో ప్లాన్‌ ‘ఎ’ పూర్తయింది. ( గౌతమ్‌ సవాంగ్‌ను సెలవుమీద పంపడం కూడా బూమ్‌రాంగ్‌ అయింది. పరువుపోవడంతో మళ్ళీ గౌతమ్‌ సవాంగ్‌ సెలవును రద్దుచేశారు. )

అంతవరకు బాగానే ఉంది. మరి పోయిన పరువును కాపాడుకునేదెట్లా? దానికి ప్లాన్‌ ‘బి’ రెడీ చేశారు. రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో వడ్డీ వ్యాపారుల మీద దాడులు ప్రారంభించారు. ముఖ్యంగా రాయలసీమలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల తదితర ప్రాంతాల్లో దాడులు చేసి వడ్డీ లెక్కల పుస్తకాలు, దస్తావేజులు స్వాధీనం చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్లాన్‌ ‘బి’ సక్రమంగా అమలు జరిగితే రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన వడ్డీవ్యాపారుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి, మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీల వాళ్ళూ ఈ దందాలో ఉన్నారని నిరూపించి, ఇతర పార్టీల మీదా ఇంత బురద చల్లాలనేది తెరవెనుక సారాంశం.

ఇతర జిల్లాల్లో జరిగే వడ్డీ వ్యాపారానికి, విజయవాడలో జరిగిన కాల్‌ మనీ వడ్డీ వ్యాపారానికి తేడా ఏమిటో మీడియా కూడ చెప్పదు.

విజయవాడలో వడ్డీలు కట్టలేని వారి కుటుంబ స్త్రీలను వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించారు. కొంతమందిని లైంగికంగా వాడుకున్నారు – ఇలా విజయవాడలో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు, మిగతా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు తేడా లేదా?

అధిక వడ్డీలను వసూలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తప్పుకాదు. కాని ఈ సందర్భంగా బెజవాడ కల్చర్‌ను, రాయలసీమ కల్చర్‌ను ఒకే గాటన కట్టాలనుకోవడం తప్పు.
గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల మీద దాడులు చెయ్యాలని, అధిక వడ్డీలు వసూలు చేసేవాళ్ళను శిక్షించాలని ఒక సందర్భంలో కె.సి.ఆర్‌ కూడా అనుకున్నాడు. కాని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వక, వడ్డీ వ్యాపారుల్ని కట్టడి చేస్తే రైతుల గతి ఏమిటని ఆ ప్రయత్నం మానుకున్నాడు.

ఆంధ్రలో చంద్రబాబు పుణ్యాన బ్యాంకులు ఒక్కపైసా రుణం ఇవ్వడం లేదు. ఇప్పుడు వడ్డీ వ్యాపారుల్నీ బెదరకొడితే రైతుల గతి ఏమిటి? బెజవాడ టిడిపి నాయకులకోసం రైతుల్ని బలిపెడతారా?

First Published:  16 Dec 2015 7:01 AM IST
Next Story