కిషన్ రెడ్డి దారెటు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే వరుసగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే జనవరిలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి కూడా మూడోసారి అధ్యక్ష బాధ్యలు చేపట్టడానికి అవకాశం ఉండదు. దీంతో అధ్యక్ష బాధ్యతల నుంచి కిషన్ రెడ్డి వైదొలిగాక భవిష్యత్తు ఏంటన్నదానిపై ఆయన అనుచరులతోపాటు పార్టీలోనూ చర్చ కొనసాగుతోంది. చిన్న వయసులోనే బీజేపీ […]
BY sarvi15 Dec 2015 2:18 PM IST
X
sarvi Updated On: 15 Dec 2015 2:18 PM IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే వరుసగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే జనవరిలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి కూడా మూడోసారి అధ్యక్ష బాధ్యలు చేపట్టడానికి అవకాశం ఉండదు. దీంతో అధ్యక్ష బాధ్యతల నుంచి కిషన్ రెడ్డి వైదొలిగాక భవిష్యత్తు ఏంటన్నదానిపై ఆయన అనుచరులతోపాటు పార్టీలోనూ చర్చ కొనసాగుతోంది.
చిన్న వయసులోనే బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు కిషన్ రెడ్డి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. శాసనసభా పక్ష నేతగానూ వ్యవహరించారు. జాతీయ యువమోర్చాలోనూ పని చేశారు. దీంతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర్నుంచి ఇతర ముఖ్యమైన సీనియర్ బీజేపీ నేతలందరితోనూ కిషన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డితో కలిసి పనిచేసిన బీజేవైఎం నాయకులు వివిధ రాష్ట్రాల ఇంచార్జులుగా, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కాబట్టి కిషన్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డిని అధిష్టానం జాతీయ రాజకీయాల్లోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.
జనవరిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టిన తర్వాత ఢిల్లీబాట పట్టేందుకు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అన్నీ కలిసొస్తే త్వరలోనే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి గానీ, త్వరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రానికి గాని కిషన్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించవచ్చని తెలుస్తోంది.
Next Story