చిన్న సినిమా కోసం పెద్ద ఛానెళ్లు కొట్టుకుంటున్నాయి
కొన్ని సార్లు చిన్న సినిమాలే ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటాయి. కానీ ఏ చిన్న సినిమాకూ విడుదలకు ముందు హైప్ రాదు. మార్కెట్ అస్సలుండదు. కానీ దీనికి రివర్స్ లో నాగశౌర్య చేసిన ఓ సినిమా పోటీకి తెరలేపింది. క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం రెండు పెద్ద ఛానెళ్లయిన… మాటీవీ-జెమినీ టీవీ…. మాకే కావాలంటూ పోటీపడుతున్నాయి. ఆ సినిమా పేరు అబ్బాయితో అమ్మాయి. రవితేజతో అప్పట్లో వీర లాంటి ఫ్లాప్ […]
BY sarvi14 Dec 2015 7:08 PM
X
sarvi Updated On: 15 Dec 2015 8:12 AM
కొన్ని సార్లు చిన్న సినిమాలే ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటాయి. కానీ ఏ చిన్న సినిమాకూ విడుదలకు ముందు హైప్ రాదు. మార్కెట్ అస్సలుండదు. కానీ దీనికి రివర్స్ లో నాగశౌర్య చేసిన ఓ సినిమా పోటీకి తెరలేపింది. క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం రెండు పెద్ద ఛానెళ్లయిన… మాటీవీ-జెమినీ టీవీ…. మాకే కావాలంటూ పోటీపడుతున్నాయి. ఆ సినిమా పేరు అబ్బాయితో అమ్మాయి. రవితేజతో అప్పట్లో వీర లాంటి ఫ్లాప్ సినిమా తీసిన రమేశ్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఎలాంటి స్టార్ వాల్యూ లేని ఇలాంటి సినిమా శాటిలైట్ రైట్స్ కు ఏకంగా 3 కోట్ల రూపాయలు పెట్టడానికి మా, జెమినీ పోటీపడుతున్నాయి. దీనికి ఓ కారణం కూడా ఉంది.
గతంలో నాగశౌర్య నటించిన సినిమాలు థియేటర్లలో ఏ రేంజ్ లో ఆడాయన్నది పక్కనపెడితే…. బుల్లితెరపై మాత్రం తెగ ఆడేశాయి. ఆ హీరో నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాను మాటీవీ చాలా సార్లు ప్రసారం చేసింది. జనాలు కూడా చాలా సార్లు చూస్తూనే ఉన్నారు. తాజాగా నాగశౌర్య నటించిన లక్ష్మిరావే మా ఇంటికి సినిమాను కూడా ఎన్నిసార్లు ప్రసారం చేస్తున్నా జనాలు చూస్తూనే ఉన్నారు. దీంతో శాటిలైట్ హీరో అయిపోయాడు నాగశౌర్య. అందుకే తాజా మూవీ జయాపజయాలతో సంబంధం లేకుండా… అబ్బాయితో అమ్మాయి సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు సదరు బడా ఛానళ్లు ఎగబడుతున్నాయి.
Next Story