ఆంధ్రా విజయ్‌మాల్యా
కావూరి ఆఫీస్ ముందు మౌనపోరాటం మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరిసాంబశివరావు ప్రతిష్ట రోడ్డెక్కింది. కావూరికి చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పుతీసుకుని తిరిగిచెల్లించడం లేదు. దీంతో విసిగిపోయిన బ్యాంకుల ప్రతినిధులు హైదరాబాద్ అబిడ్స్‌లోని కంపెనీ కార్యాలయం ముందు మౌనప్రదర్శనకు దిగారు. దాదాపు 18 బ్యాంకుల ప్రతినిధులు ఉమ్మడిగా ఈ నిరసనప్రదర్శన నిర్వహించారు. రుణాలు చెల్లించి బ్యాంకులను కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వివిధ బ్యాంకుల నుంచి కావూరి కంపెనీ వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. ఒక్క ఆంధ్రా బ్యాంకు సుల్తాన్ […]
కావూరి ఆఫీస్ ముందు మౌనపోరాటం
మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరిసాంబశివరావు ప్రతిష్ట రోడ్డెక్కింది. కావూరికి చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పుతీసుకుని తిరిగిచెల్లించడం లేదు. దీంతో విసిగిపోయిన బ్యాంకుల ప్రతినిధులు హైదరాబాద్ అబిడ్స్‌లోని కంపెనీ కార్యాలయం ముందు మౌనప్రదర్శనకు దిగారు. దాదాపు 18 బ్యాంకుల ప్రతినిధులు ఉమ్మడిగా ఈ నిరసనప్రదర్శన నిర్వహించారు. రుణాలు చెల్లించి బ్యాంకులను కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వివిధ బ్యాంకుల నుంచి కావూరి కంపెనీ వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. ఒక్క ఆంధ్రా బ్యాంకు సుల్తాన్ బజార్ బ్రాంచ్ నుంచే 200 కోట్లు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీచేసినా సొమ్ము చెల్లించలేదు. దీని వల్ల బ్యాంకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటి ప్రతినిధులు చెబుతున్నారు.