Telugu Global
Others

రెడ్లను భలే వాడేస్తున్నావ్‌ బాస్

వాగ్ధాటిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి మాటలు మాత్రం వాగ్ధాటికి… వల్గర్‌ లాంగ్‌వేజ్‌కు మధ్య రేఖను చెరిపేస్తున్నట్టుగా ఉంది.  రేవంత్ కొన్నివిషయాల్లో చేసే కామెంట్స్‌ అలాగే ఉంటాయి. తాజాగా టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ గురించి మాట్లాడుతూ మరోసారి వైఎస్ మరణాన్ని తెరపైకి తెచ్చి,  లింక్‌ పెట్టి విమర్శలు చేశారు. గతంలో వైఎస్‌ కూడా ఇలాగే వలసలు ప్రోత్సహించారని… ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలూ అదే పనిచేస్తున్నారు కాబట్టి… వైఎస్‌ వెళ్లిన […]

రెడ్లను భలే వాడేస్తున్నావ్‌ బాస్
X
వాగ్ధాటిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి మాటలు మాత్రం వాగ్ధాటికి… వల్గర్‌ లాంగ్‌వేజ్‌కు మధ్య రేఖను చెరిపేస్తున్నట్టుగా ఉంది. రేవంత్ కొన్నివిషయాల్లో చేసే కామెంట్స్‌ అలాగే ఉంటాయి. తాజాగా టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ గురించి మాట్లాడుతూ మరోసారి వైఎస్ మరణాన్ని తెరపైకి తెచ్చి, లింక్‌ పెట్టి విమర్శలు చేశారు. గతంలో వైఎస్‌ కూడా ఇలాగే వలసలు ప్రోత్సహించారని… ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలూ అదే పనిచేస్తున్నారు కాబట్టి… వైఎస్‌ వెళ్లిన చోటికే వీరు వెళ్తారని విమర్శించారు. ”టీడీపీతో పెట్టుకుని వైఎస్ పావురాల గుట్టలో పావురమైపోయారు” అన్న డైలాగ్ సృష్టికర్త కూడా రేవంత్ రెడ్డే.
వైఎస్‌ వెళ్లిన చోటికే టీఆర్‌ఎస్ నేతలు వెళ్తారంటే … వైఎస్‌ చావు గురించి, టీఆర్‌ఎస్‌ నేతల మరణం గురించి రేవంత్ రెడ్డికి ముందే తెలుసా?. ఆ ప్లాన్‌ కూడా ఈయనకు తెలిసిపోయిందా?. మరో విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి పదేపదే (ఓటుకు నోటు టేపుల్లో కూడా) తాను రెడ్డి సామాజికవర్గాన్ని లీడ్ చేసే నాయకుడిని అని చెప్పుకుంటుంటారు. కానీ ఈ రెడ్డి అవసరం ఉన్నా లేకున్నా పదేపదే వైఎస్‌ మరణాన్ని గుర్తు చేస్తూ విమర్శలు చేస్తుంటారు. అంటే ఓట్ల కోసం రేవంత్‌కు రెడ్లు కావాలి… చంద్రబాబు దగ్గర మెప్పు పొందే ప్రక్రియలో భాగంగా తిట్టడానికి, శాపనార్థరాలు పెట్టించుకోవడానికి కూడా వైఎస్‌ లాంటి రెడ్లే కావాలి. రెడ్లను భలే వాడేస్తున్నారు బాస్!. అయినా ఎవరు ఎలా చస్తారో ఎవరు ఊహించగలరు రేవంత్ రెడ్డి గారు?. చావును కూడా హేలన చేసే రాజకీయం రేవంత్‌తోనే బాగా ఊపందుకుంది. అయినా ఇది రేవంత్‌కు, ఆయన సామాజికవర్గానికి సంబంధించిన అంశం అనుకోండి!.
First Published:  15 Dec 2015 4:26 AM IST
Next Story