1500 మంది పండితులతో ఆయుత చండీ యాగం
తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీ యాగం దేశంలో కనివీనీ ఎరుగని స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం సమీపంలోని సీఎం ఫామ్ హౌస్ ఇందుకు వేదిక కానుంది. దాదాపు 5 రాష్ట్రాల నుంచి వేదపండితులు, వారికి 500 మంది సహాయకులు ఈ చండీయాగాన్ని నిర్వహించనున్నారు. గతంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు జరిగినా.. ఇంత భారీ ఎత్తున జరగడం మాత్రం దేశంలో ఇదే తొలిసారి అని సమాచారం. […]
BY sarvi14 Dec 2015 11:03 PM IST
X
sarvi Updated On: 15 Dec 2015 4:58 AM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీ యాగం దేశంలో కనివీనీ ఎరుగని స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం సమీపంలోని సీఎం ఫామ్ హౌస్ ఇందుకు వేదిక కానుంది. దాదాపు 5 రాష్ట్రాల నుంచి వేదపండితులు, వారికి 500 మంది సహాయకులు ఈ చండీయాగాన్ని నిర్వహించనున్నారు. గతంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు జరిగినా.. ఇంత భారీ ఎత్తున జరగడం మాత్రం దేశంలో ఇదే తొలిసారి అని సమాచారం.
డిసెంబరు 23-27 వరకు ఐదు రోజుల పాటు యాగం జరగనుంది. తొలి 4 రోజులు హోమం, చండీ ప్రయాణం నిర్వహిస్తారు. ఆఖరి రోజు పూర్ణాహుతిని భారీఎత్తున జరుపనున్నారు. యాగం కోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు నెలరోజుల కిందటే ఇందుకు సంబంధించిన అన్ని పనులు మొదలయ్యాయి. పనులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పడు స్వయంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. సీఎంతోపాటు ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మరో నేత జహంగీర్ పర్యవేక్షిస్తున్నారు.
150 మంది వంటమనుషులను ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి ప్రత్యేకంగా తీసుకురానున్నారు. వీరు యాగం జరిగే 5 రోజులపాటు రోజుకు దాదాపు 50,000 మందికి భోజనాలు సిద్ధం చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 10,000 మంది భోజనం చేసేందుకు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాలను నిర్మిస్తున్నారు. ఈ యాగం సీఎం సొంత ఖర్చుతోనే చేయిస్తునప్పటికీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తామని ముందుకొస్తున్నాయని సమాచారం.
విశిష్ట అతిథులు వీరే:
ఈ యాగానికి సీఎం పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (ఈయనకు రెండుసార్లు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు), గవర్నర్లు ఈఎస్ ఎల్ నరసింహన్, సీహెచ్ విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర), కే.రోశయ్య (తమిళనాడు), వీరితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు హాజరు కానున్నారు.
Next Story