కలెక్షన్ కింగ్‌కి బెదిరిపోయిన అల్లరోడు!
‘అల్లరి’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కుర్రహీరో నరేశ్! అది మొదలు తొలిసినిమానే ఇంటిపేరుగా చేసుకున్నాడు ఈ ‘అత్తిలి సత్తిబాబు’! నిర్మాతలెవరైనా ఈ ‘సుడిగాడి’తో సినిమా అంటే వెంటనే అడ్వాన్సులతో వచ్చి వాలిపోతారు. ఎందుకంటే.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాకు పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే హీరోల్లో ‘అల్లరి’ నరేశ్ కూడా ఒకడు. అందుకే ఈ ‘బెట్టింగ్ బంగార్రాజు’ చిత్రాలు వరుసగా ఫ్లాపవుతున్నా కొత్త సినిమాలు తలుపు తడుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. అయితే, షూటింగ్‌కు ఉదయం 11 గంటల […]
BY sarvi15 Dec 2015 12:33 AM IST
X
sarvi Updated On: 15 Dec 2015 6:17 AM IST
‘అల్లరి’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కుర్రహీరో నరేశ్! అది మొదలు తొలిసినిమానే ఇంటిపేరుగా చేసుకున్నాడు ఈ ‘అత్తిలి సత్తిబాబు’! నిర్మాతలెవరైనా ఈ ‘సుడిగాడి’తో సినిమా అంటే వెంటనే అడ్వాన్సులతో వచ్చి వాలిపోతారు. ఎందుకంటే.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాకు పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే హీరోల్లో ‘అల్లరి’ నరేశ్ కూడా ఒకడు. అందుకే ఈ ‘బెట్టింగ్ బంగార్రాజు’ చిత్రాలు వరుసగా ఫ్లాపవుతున్నా కొత్త సినిమాలు తలుపు తడుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. అయితే, షూటింగ్‌కు ఉదయం 11 గంటల తరువాతే వస్తాడని, మన ‘సీమశాస్త్రి’కి ఇండస్ర్టీలో ఒక ముద్ర పడిపోయింది. అందుకే దర్శక – నిర్మాతలు కూడా అదే సమయానికి షూటింగ్ ప్లాన్ చేసుకునేవారంట. ఎందుకంటే నరేశ్ బారెడు పొద్దేక్కేదాకా నిద్రపోతాడని, ఉదయాన్నే లేచేందుకు బద్దకిస్తాడని సమాచారం.
కలెక్షన్ కింగ్ సినిమాతో..!
తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి నరేశ్ నటించిన చిత్రం ‘మామ మంచు- అల్లుడు కంచు’. మోహన్ బాబు సినిమా అంటే.. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ చిత్రం షూటింగ్‌కి కూడా అల్లరి నరేశ్ కూడా ఆలస్యంగా వస్తాడనుకున్నారట యూనిట్ సభ్యులు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అల్లరి నరేశ్ మోహన్ బాబు కంటే ముందే.. ఉదయం 7 గంటల కల్లా స్పాట్‌లో రెడీగా ఉండి ‘మా అల్లుడు వెరీ గుడ్’ అనిపించుకున్నాడట. మోహన్‌బాబుకు బెదిరిపోయిన నరేశ్ టైమ్‌కు వచ్చాడని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.
Next Story