చరణ్‌కు కథ చెప్పనన్న త్రివిక్రమ్!
వరుస పరాజయాలతో సతమతమవుతున్న తన అన్నకొడుకు రామ్ చరణ్‌కు ఎలాగైనా ఓ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు బాబాయ్ పవన్ కల్యాణ్. అందుకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో తానే స్వయంగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవానికి ఈ సినిమా పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రావాలి. ఇద్దరికి డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను చరణ్‌తో చేయమని సూచించాడట పవన్. పవన్ కోరిక కాదనలేకపోయిన త్రివిక్రమ్ చెర్రీతో సినిమాకు ఓకే చెప్పేశాడు. చెర్రీ నొచ్చుకున్నాడట! త్రివిక్రమ్ ఇప్పుడు వరుస […]
BY sarvi15 Dec 2015 12:34 AM IST

X
sarvi Updated On: 15 Dec 2015 9:29 AM IST
వరుస పరాజయాలతో సతమతమవుతున్న తన అన్నకొడుకు రామ్ చరణ్‌కు ఎలాగైనా ఓ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు బాబాయ్ పవన్ కల్యాణ్. అందుకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో తానే స్వయంగా ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవానికి ఈ సినిమా పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రావాలి. ఇద్దరికి డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను చరణ్‌తో చేయమని సూచించాడట పవన్. పవన్ కోరిక కాదనలేకపోయిన త్రివిక్రమ్ చెర్రీతో సినిమాకు ఓకే చెప్పేశాడు.
చెర్రీ నొచ్చుకున్నాడట!
త్రివిక్రమ్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నితిన్‌తో ప్రస్తుతం అ..ఆ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి నాటికి పూర్తవుతుంది. తరువాత సూర్య హీరోగా నటించే ద్విభాషా చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు. ఇందుకు సంబంధించిన స్ర్కిప్టు పని కూడా మొదలైందని సమాచారం. ఈ మధ్య త్రివిక్రమ్‌ను కలిసిన చెర్రీ తాము చేయబోయే సినిమా గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. కథ ఏంటని అడిగిన చెర్రీకి ఇప్పుడు చెప్పలేనని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చాడట. కనీసం స్టోరీ లైన్ అయినా చెప్పేందుకు ససేమీరా అన్నాడట. స్టోరీ లైన్ తనకు నచ్చకపోతే మార్చుకునే వీలుంటుందన్నది చెర్రీ ఆలోచన. అయితే, త్రివిక్రమ్ ఇలాంటి సమాధానం ఇవ్వడంతో చెర్రీ నొచ్చుకున్నాడట పాపం!
Next Story