ఎన్టీఆర్ కు మంగళవారం కలిసొస్తుందా ?
సినిమా శుక్రవారం రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇక్కడైనా, ఓవర్సీస్ లో అయినా శుక్రవారం బాగా కలిసొస్తుంది. ఎందుకంటే… ఆ వెంటనే వీకెండ్ ఉంటుంది కాబట్టి… హైప్ కారణంగా సినిమాకు వసూళ్లు బాగా వస్తాయి. కాబట్టి… చాలా సందర్భాల్లో ప్రీమియర్లు గురువారం పెట్టుకుంటారు. అది సక్సెస్ అయిన విషయం కూడా ప్రూవ్ అయింది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. యంగ్ టైగర్ కు అనుకోకుండా మంగళవారం ఎదురైంది. తన కొత్త సినిమా నాన్నకు ప్రేమతో మూవీని జనవరి […]
BY sarvi13 Dec 2015 4:39 PM GMT
X
sarvi Updated On: 13 Dec 2015 10:57 PM GMT
సినిమా శుక్రవారం రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇక్కడైనా, ఓవర్సీస్ లో అయినా శుక్రవారం బాగా కలిసొస్తుంది. ఎందుకంటే… ఆ వెంటనే వీకెండ్ ఉంటుంది కాబట్టి… హైప్ కారణంగా సినిమాకు వసూళ్లు బాగా వస్తాయి. కాబట్టి… చాలా సందర్భాల్లో ప్రీమియర్లు గురువారం పెట్టుకుంటారు. అది సక్సెస్ అయిన విషయం కూడా ప్రూవ్ అయింది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. యంగ్ టైగర్ కు అనుకోకుండా మంగళవారం ఎదురైంది. తన కొత్త సినిమా నాన్నకు ప్రేమతో మూవీని జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఎన్టీఆర్. సంక్రాంతి కానుకగా వస్తుంది కాబట్టి జనవరి 13 కరెక్ట్. కానీ ఆ రోజు బుధవారం పడింది. కాబట్టి ప్రీమియర్లు కచ్చితంగా మంగళవారం పడాలి. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇబ్బందిగా మారింది.
ఏపీ, తెలంగాణలో ప్రీమియర్ షోలు మంగళవారం అంటే పర్లేదు. ఎందుకంటే… ఇక్కడ హార్డ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి సినిమాకు వెళ్తారు. కానీ ఓవర్సీస్ లో మంగళవారం అంటే పీక్ పనిదినం. ఆ రోజున ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా పనిలో నిమగ్నమైపోతారు ఓవర్సీస్ జనాలు. మరి అలాంటి టైమ్ లో నాన్నకు ప్రేమతో సినిమా ప్రీమియర్ ను ప్లాన్ చేస్తే వర్కవుట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాడు యంగ్ టైగర్. ఒకవేళ ప్రీమియర్ లోనే నెగెటివ్ టాక్ వస్తే… వీకెండ్ వరకు సినిమాను లాగించడం చాలా కష్టం. ఓవర్సీస్ లోనే కాదు… ఇక్కడ కూడా నెగెటివ్ టాక్ వస్తే… వీకెండ్ వరకు సినిమాను నడపడం చాలా కష్టం. ఎందుకంటే… సంక్రాంతి బరిలో డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బడా సినిమాలున్నాయి. కానీ మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ మంగళవారం అడ్డంకిని యంగ్ టైగర్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
Next Story