అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలి: చంద్రబాబు
2018 నాటికి అమరావతిలో పరిపాలన నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి, సేవలు, మూడింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూనే సమ్మిళిత వృద్ధి సాధించాలని సోమవారం ఉదయం కలెక్టర్ల సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. మొదటి త్రైమాసికానికి 9.72శాతం, రెండవ త్రైమాసికానికి 13.94శాతం వృద్ధి సాధించామని, రెండు త్రైమాసికాలలో కలిపి మొత్తం వృద్ధి రేటు 11.77శాతంగా వున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టంచేసిన […]
2018 నాటికి అమరావతిలో పరిపాలన నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి, సేవలు, మూడింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూనే సమ్మిళిత వృద్ధి సాధించాలని సోమవారం ఉదయం కలెక్టర్ల సదస్సులో ఆయన దిశానిర్దేశం చేశారు. మొదటి త్రైమాసికానికి 9.72శాతం, రెండవ త్రైమాసికానికి 13.94శాతం వృద్ధి సాధించామని, రెండు త్రైమాసికాలలో కలిపి మొత్తం వృద్ధి రేటు 11.77శాతంగా వున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి, సృష్టించిన సంపద ఫలాలు పేదలకు అందేలా ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలని కోరారు.
విజయవాడ తాజ్ గేట్‌వే హోటల్‌లో జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సు తొలిరోజు సమావేశంలో ముఖ్యమంత్రి ద్వితియ త్రైమాసిక ఫలితాలను విడుదలచేసి, రెండంకెల వృద్ధి రేటు సాధన లక్ష్యంగా కీలక ప్రసంగం చేశారు.రానున్న ఆరునెలల కాలానికి రూపొందించాల్సిన ప్రణాళికలు, కార్యాచరణపై అధికారులకు మార్గదర్శనం చేశారు.