రాశీ ఖన్నాకు అనుష్క వార్నింగ్!
అప్‌కమింగ్ హీరోయిన్ రాశీ ఖన్నాకు టాప్ హీరోయిన్ అనుష్క వార్నింగ్ ఇచ్చిందట! వీరద్దరి మధ్య వార్నింగ్ ఇచ్చేంతగా ఏం వివాదం వచ్చిందని కంగారుపడుతున్నారా? ఆగండాగండి…అక్కడికే వస్తున్నాం! ఇప్పుడున్న నవతరం నాయికల్లో కాస్త బబ్లీగా ఉండే హీరోయిన్ రాశీ ఖన్నా ఒక్కతే. వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది. తన శరీరం, బరువుపై కొంతకాలంగా రాశీఖన్నా బెంగ మొదలైందట. సీనియర్ హీరోయిన్, యోగా టీచర్ అయిన అనుష్కకు ఫోన్ చేసి తాను కృత్రిమ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకుంటున్నా అని చెప్పి […]
BY sarvi14 Dec 2015 2:22 AM IST
X
sarvi Updated On: 14 Dec 2015 9:55 AM IST
అప్‌కమింగ్ హీరోయిన్ రాశీ ఖన్నాకు టాప్ హీరోయిన్ అనుష్క వార్నింగ్ ఇచ్చిందట! వీరద్దరి మధ్య వార్నింగ్ ఇచ్చేంతగా ఏం వివాదం వచ్చిందని కంగారుపడుతున్నారా? ఆగండాగండి…అక్కడికే వస్తున్నాం! ఇప్పుడున్న నవతరం నాయికల్లో కాస్త బబ్లీగా ఉండే హీరోయిన్ రాశీ ఖన్నా ఒక్కతే. వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది. తన శరీరం, బరువుపై కొంతకాలంగా రాశీఖన్నా బెంగ మొదలైందట. సీనియర్ హీరోయిన్, యోగా టీచర్ అయిన అనుష్కకు ఫోన్ చేసి తాను కృత్రిమ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకుంటున్నా అని చెప్పి సలహా అడిగిందట. దీంతో అనుష్క సీరియస్ అయిందట. అలాంటి వాటి జోలికి వెళ్లకూడదని, నీ ఆరోగ్యం, కెరీర్ రిస్కులో పడతాయని హెచ్చరిందట. ఒక్కసారిగా బరువు తగ్గడం మంచిది కాదని సలహా ఇచ్చినట్లు సమాచారం. అనుష్క మాటలతో రియలైజ్ అయిన రాశీ తాను బరువు తగ్గే ప్రోగ్రాం వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అదీ మరీ..అంటే అనుష్క వార్నింగ్ ఇచ్చింది అందుకన్నమాట!
Next Story