కోడెలకు సొంత నియోజకవర్గంపై ఆసక్తి లేదా?
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నరసరావుపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నరసరావుపేటకు సంబంధించి ఏ సమస్య పరిష్కారానికైనా వెంటనే చొరవ చూపుతున్నారు. నరసరావుపేట మున్సిపాలిటి శతాబ్ధి ఉత్సవాలను దగ్గరుండి అంతా తానై ఘనంగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు వివాదం కూడా ఇక్కడే తలెత్తుతోంది. ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు నరసరావుపేట ఎమ్మెల్యే కాదు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాని ఆయన సత్తెనపల్లి కంటే నరసరావుపేటకే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి […]
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నరసరావుపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నరసరావుపేటకు సంబంధించి ఏ సమస్య పరిష్కారానికైనా వెంటనే చొరవ చూపుతున్నారు. నరసరావుపేట మున్సిపాలిటి శతాబ్ధి ఉత్సవాలను దగ్గరుండి అంతా తానై ఘనంగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు వివాదం కూడా
ఇక్కడే తలెత్తుతోంది.
ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు నరసరావుపేట ఎమ్మెల్యే కాదు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాని ఆయన సత్తెనపల్లి కంటే నరసరావుపేటకే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. కానీ నరసరావుపేట మన్సిపాలిటి శతాబ్ధి ఉత్సవాల్లో శ్రీనివాస్ రెడ్డి ప్రమేయమే లేకుండా చేశారు. దీనిపైనే నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు సత్తెనపల్లికి ఎమ్మెల్యేగా ఉన్న కోడెల … స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి నరసరావుపేటలో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
మిగిలిన ప్రతిపక్ష నాయకులు కూడా కోడెల తీరును తప్పుపడుతున్నారు. నరసరావుపేట తన సొంత రాజ్యం అన్న భావనలోనే కోడెల ఉన్నారని విమర్శిస్తున్నారు. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బరిలో దింపేందుకు కోడెల ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే తన పరిధిలో లేని నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఐదేళ్ల కాలానికి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి… ఈ ఐదేళ్లు సత్తెనపల్లికి సేవ చేయాలని కోరుతున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సత్తెనపల్లిని సొంతనియోజకవర్గంగా భావించి పనిచేయాలని సూచిస్తున్నారు.