ఇండియా డ్రైవింగ్ లైసెన్సుతో ఈ దేశాల్లో తిరిగేయొచ్చు!
భారతదేశంలో తీసుకున్న డ్రైవింగ్ లెసెన్సుని కొంతకాలం పాటు అనుమతించే దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ దేశాల్లో ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సుతో హాయిగా విదేశాల్లో వెహికల్స్ నడిపేయవచ్చు. ఆ దేశాలు…కాలపరిమితి వివరాలు- మూడు నెలల పాటు ఆస్ట్రేలియా అంతటా మన దేశ డ్రైవింగ్ లైసెన్సుతో వెహికల్స్‌ని నడిపేయవచ్చు. మూడు నెలలు దాటితే అక్కడి చట్టాలు ఊరుకోవు. కానీ ఇదీ తక్కువ సమయం కాదు కదా. ఒక సంవత్సరకాలం న్యూజీలాండ్‌లో మన డ్రైవింగ్ లైసెన్సుతో వాహనాలు నడిపేందుకు అనుమతి […]
BY sarvi12 Dec 2015 9:00 PM GMT
X
sarvi Updated On: 13 Dec 2015 5:56 AM GMT
భారతదేశంలో తీసుకున్న డ్రైవింగ్ లెసెన్సుని కొంతకాలం పాటు అనుమతించే దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ దేశాల్లో ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సుతో హాయిగా విదేశాల్లో వెహికల్స్ నడిపేయవచ్చు. ఆ దేశాలు…కాలపరిమితి వివరాలు-
- మూడు నెలల పాటు ఆస్ట్రేలియా అంతటా మన దేశ డ్రైవింగ్ లైసెన్సుతో వెహికల్స్‌ని నడిపేయవచ్చు. మూడు నెలలు దాటితే అక్కడి చట్టాలు ఊరుకోవు. కానీ ఇదీ తక్కువ సమయం కాదు కదా.
- ఒక సంవత్సరకాలం న్యూజీలాండ్‌లో మన డ్రైవింగ్ లైసెన్సుతో వాహనాలు నడిపేందుకు అనుమతి ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌లో కూడా సంవత్సరకాలం మన లైసెన్సు పనిచేస్తుంది. దక్షిణ ఆఫ్రికాలో సైతం సంవత్సర కాలం అనుమతి ఉంది.
- ఫ్రాన్స్‌లో కూడా మన డ్రైవింగ్ లైసెన్సు ఒక సంవత్సరకాలం పనిచేస్తుంది. అయితే ఆ లైసెన్సుకి ఫ్రెంచి భాష అనువాద ప్రతిని మనవద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.
- నార్వేలో మూడు నెలల పాటు అనుమతి ఉంది.
- డ్రైవింగ్ లైసెన్సు ఇంగ్లీషులో ఉంటే అమెరికాలో ఒక సంవత్సరకాలం పనిచేస్తుంది. యుకెలో కూడా ఇదే కాలపరిమితి వర్తిస్తుంది.
- జర్మనీలో మన లైసెన్సుని ఆరునెలల పాటు నిరభ్యంతరంగా వాడవచ్చు. అయితే అక్కడి దౌత్య కార్యాలయం నుండి దాన్ని జర్మనీ భాషలోకి అనువాదం చేయించుకోవాలి.
- ఫిన్లాండ్‌లో ఆరునెలల నుండి ఒక సంవత్సరం వరకు భారత డ్రైవింగ్ లైసెన్సుకి అనుమతి ఉంది. ఆరునెలల తరువాత సంవత్సరం లోపు పొడిగింపు విషయంలో మనకున్న ఇన్సూరెన్స్‌ని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
Next Story