గోళ్లు...మన ఆరోగ్యానికి ఆనవాళ్లు!
కళ్లు, చర్మం, జుట్టు, పళ్లు…ఇవన్నీ మన ఆరో గ్యం గురించి ఎంతోకొంత బయటకు చెబుతుంటాయి. అలాగే మన చేతుల గోళ్లను బట్టి కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాం అనే సంగతులు తెలుసుకోవచ్చట. గోళ్లలో మార్పులు కనబడితే నెయిల్ పాలిష్‌తో కప్పిపుచ్చకుండా, డాక్టరు వద్దకు వెళ్లటం మంచిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలు- గోళ్లు పలుచగా పెళుసుగా ఉండి, పగుళ్లు బారుతుంటే అది పొడిబారడంగా భావించాలి. దీర్ఘకాలంగా గోళ్లు ఇలా పెళుసుగా […]
కళ్లు, చర్మం, జుట్టు, పళ్లు…ఇవన్నీ మన ఆరో గ్యం గురించి ఎంతోకొంత బయటకు చెబుతుంటాయి. అలాగే మన చేతుల గోళ్లను బట్టి కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాం అనే సంగతులు తెలుసుకోవచ్చట. గోళ్లలో మార్పులు కనబడితే నెయిల్ పాలిష్‌తో కప్పిపుచ్చకుండా, డాక్టరు వద్దకు వెళ్లటం మంచిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలు-
- గోళ్లు పలుచగా పెళుసుగా ఉండి, పగుళ్లు బారుతుంటే అది పొడిబారడంగా భావించాలి. దీర్ఘకాలంగా గోళ్లు ఇలా పెళుసుగా కనబడుతుంటే దాన్ని ఐరన్ లోపంగా గుర్తించాలి. గోళ్లు ఈ విధంగా ఉండి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, చలి ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
- గోళ్లు చక్కని పింక్ రంగులో కాకుండా లేత నీలం రంగులోకి మారుతుంటే దాన్ని అనారోగ్య చిహ్నంగా భావించాలి. సాధారణంగా చలి వాతావరణంలో గోళ్లు ఇలా కనబడుతుంటాయి. కానీ తరచుగా గోళ్లు ఇలా నీలం రంగులో కనబడుతుంటే మన శరీరంలో రక్తానికి తగిన ఆక్సిజన్ అందడం లేదని గమనించాలి. ఆక్సిజన్ సరిపడా అందుతుంటే రక్తం మంచి ఎరుపు రంగులో ఉండి మన చర్మం, గోళ్లు అందమైన గులాబి రంగుని సంతరించుకుని ఉంటాయి.
- గోళ్ల ఉపరితరం హెచ్చుతగ్గులుగా, అక్కడక్కడా లొట్టలు పడినట్టుగా ఉంటే అది సొరియాసిస్ రానున్నదనడానికి సంకేతం కావచ్చు. ఒక్కోసారి అనాలోచితంగా, అలవాటుగా గోరుపై భాగాన్ని నోట్లో పళ్లకు తరచుగా తాకిస్తూ ఉన్నాఈ పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త పడకపోతే ఆ గుర్తులు గోరుపై ఎప్పటికీ అలా నిలిచిపోతాయి.
- గోళ్లమీద తెల్లని చిన్నపాటి గీతలు సర్వసాధారణంగా కనబడుతుంటాయి. వాటిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి గోరుమీద ఇలాంటి తెల్లని గీతలు కాస్త హెచ్చుస్థాయిలోనే కనబడుతుంటే రక్తంలో ప్రొటీన్లు లోపించినట్టుగా గుర్తించాలి. గుడ్డులోని తెల్లసొన. పప్పు ధాన్యాలు, సోయా ఆహారంలో చేర్చుకుంటే ఈ తెల్లని గీతలు మాయమైపోతాయి.
- గోళ్లు తెల్లగా పాలిపోయినట్టుగా కనబడుతుంటే అది రక్తం లేకపోవడం అంటే అనీమియా. రక్తంలో ఆక్సిజన్, ఐరన్ కొరతని తీర్చగల ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య తీరుతుంది. త్వరగా సమస్యనుండి బయటపడాలంటే డాక్టరుని సంప్రదించడమూ మంచిదే.